ఇటీవల కాలంలో యాపిల్ సైడర్ వెనిగర్ ఉపయోగం విపరీతంగా పెరిగిపోయింది. ఎందుకంటే ఇప్పుడు ఆరోగ్య స్పృహ ఉన్న వ్యక్తుల లిస్ట్‌లో వెనిగర్ ఒకటిగా చేరిపోయింది. యాపిల్ సైడర్ వెనిగర్ బరువు తగ్గడానికి సహాయపడుతుంది. శరీరంలోని అదనపు కొవ్వును పోగొట్టడానికి దీనికి మించిన ప్రత్యామ్నాయం లేదు. ఉదయం పూట గోరువెచ్చని నీటిలో యాపిల్ సైడర్ వెనిగర్ మిక్స్ చేసి తాగితే బరువు ఇట్టే కరిగిపోతుంది. యాపిల్ సైడర్ వెనిగర్ కండరాల నొప్పిని తగ్గిస్తుంది. మోకాళ్ల నొప్పులను తగ్గించడంలో ఇది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.
ఈ వెనిగర్ మోకాళ్లలో పేరుకుపోయిన మలినాలను తొలగిస్తుంది. వెనిగర్ గొంతు నొప్పిని కూడా నయం చేయడానికి సహాయపడుతుంది. గోరువెచ్చని నీటిలో ఆపిల్ సైడర్ వెనిగర్ కలిపి పుక్కిలించడం వల్ల గొంతు నొప్పి నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది. అలాగే యాపిల్ సైడర్ వెనిగర్ ఎక్కిళ్లను ఆపడానికి కూడా సహాయపడుతుంది. తరచుగా ఎక్కిళ్లు వస్తున్నట్లయితే, ఆపిల్ సైడర్ వెనిగర్‌లో గోరువెచ్చని నీటిని కలిపి తాగితే చాలు ఎక్కిళ్లు ఆగిపోతాయి. ఈ వెనిగర్‌ను హెయిర్ కండీషనర్‌గా ఉపయోగించవచ్చు. ఒక కప్పు నీటిలో కొద్దిగా ఆపిల్ వెనిగర్‌ను కలిపి జుట్టుకు అప్లై చేయాలి. ఇది గొప్ప కండీషనర్‌గా పనిచేస్తుంది.
ఇది జుట్టును మెరిసేలా చేసి, మృదువుగా మారుస్తుంది. అంతేకాకుండా జుట్టు రాలడం సమస్య కూడా ఆగిపోతుంది. యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకునేటప్పుడు గుర్తుంచుకోవలసిన విషయం ఒకటి ఉంది. అదేంటంటే.. దీన్ని ఎక్కువగా తీసుకోకూడదు. ఫలితంగా శరీరంలో పొటాషియం తగ్గే ప్రమాదం ఉంది. గ్లాసుతో నేరుగా సిప్ చేయడానికి బదులుగా స్ట్రాతో తాగాలి. ఇది పంటి ఎనామిల్‌ను దెబ్బతీస్తుంది.