Fruits : ఈ పండ్లు.. అందానికి, ఆరోగ్యానికి ఎంత ఉపయోగపడతాయో తెలుసా??

మనం ఆరోగ్యంగాను(Health), అందంగానూ(Beauty) ఉండడానికి కొన్ని రకాల పండ్లు(Fruits) ఎంతగానో ఉపయోగపడతాయి. అవి ఆరోగ్యం ఇస్తాయి. అలాగే వాటితో ఫేస్ ప్యాక్ లు చేసుకొని అందంగా తయారవ్వొచ్చు.

  • Written By:
  • Publish Date - June 8, 2023 / 09:30 PM IST

ఈ రోజుల్లో అందరూ జంక్ ఫుడ్(Junk Food), ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తింటున్నారు దీని వలన అనేక రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కుంటున్నారు. ఇక కొంతమంది అందంగా ఉండడానికి అనేక రకాల ఫేస్ క్రీములు, మేకప్ ఐటమ్స్ వాడి వారి చర్మాన్ని దెబ్బతినేలా చేసుకుంటున్నారు. కాబట్టి మనం ఆరోగ్యంగాను(Health), అందంగానూ(Beauty) ఉండడానికి కొన్ని రకాల పండ్లు(Fruits) ఎంతగానో ఉపయోగపడతాయి. అవి ఆరోగ్యం ఇస్తాయి. అలాగే వాటితో ఫేస్ ప్యాక్ లు చేసుకొని అందంగా తయారవ్వొచ్చు.

రోజుకు ఒక ఆపిల్ తినండి డాక్టర్ ని దూరంగా ఉంచండి అంటారు ఎందుకంటే ఆపిల్ లో విటమిన్ సి, యాంటి ఆక్సిడెంట్లు, ఫైబర్, జీరో కొలెస్ట్రాల్ ఉంటాయి కాబట్టి. ఆపిల్ గుజ్జుతో ఫేసియల్ చేసుకోవడం వలన దానిలోని విటమిన్ సి చర్మ ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది. ఆపిల్ రోజూ తినడం వలన అది మన ఆరోగ్యానికి కూడా మంచిది.

రోజూ ఒక అరటిపండు తినడం మన శరీరంలో జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అరటిపండులో అనేక రకాల విటమిన్స్, మినరల్స్ ఉంటాయి అవి మన ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. అరటిపండుతో ఫేసియల్ చేసుకోవడం వలన అది మన చర్మం పైన మృతకణాలను తొలగిస్తుంది. ఇంకా మాయిశ్చరైజర్ గా ఉపయోగపడుతుంది.

బొప్పాయి తినడం వలన మలబద్దకం, గ్యాస్, అజీర్తి వంటి సమస్యలు తగ్గుతాయి. బొప్పాయిలో ఉండే విటమిన్ ఎ మన కంటి ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. బొప్పాయితో ఫేసియల్ చేసుకోవడం వలన మన ముఖంపైన ఉండే జిడ్డు తొలగిపోయి మన చర్మం కాంతివంతంగా తయారవుతుంది.

మనకు ఎండాకాలంలో ఎక్కువగా లభించేది పుచ్చకాయ దానిని తినడం వలన మన ఆరోగ్యానికి నీటి శాతం అందుతుంది. దీనితో ఫేసియల్ చేసుకోవడం వలన చర్మం పొడిబారడం తగ్గుతుంది. ఇంకా అది మన చర్మానికి మాయిశ్చరైజర్ గా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇలాంటి పండ్లను మనం తినడం వలన మన ఆరోగ్యానికి మంచిది ఇంకా ఈ పండ్లతో ఫేషియల్స్ చేసుకోవడం వలన మనం అందంగా తయారవచ్చు.

 

Also Read : Fruits: బ్రేక్ ఫాస్ట్ మానేసి పండ్లు తీసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా?