Covid Antibodies: కోడిగుడ్డుతో కరోనాకు చెక్ పెట్టండి ఇలా?

గత మూడు సంవత్సరాల నుంచి ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారిని అరికట్టడం కోసం అన్ని విధాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలలో కూడా కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకువచ్చారు.

  • Written By:
  • Publish Date - July 30, 2022 / 08:15 AM IST

గత మూడు సంవత్సరాల నుంచి ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారిని అరికట్టడం కోసం అన్ని విధాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలలో కూడా కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకువచ్చారు. అయితే ఈ కరోనా మహమ్మారిని కట్టడి చేయడం కోసం శాస్త్రవేత్తలు ఇప్పటికీ ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉన్నారు.ఈ క్రమంలోనే కరోనాకు పూర్తిగా చెక్ పెట్టడానికి సరికొత్త ప్రయత్నంలో భాగంగా కోడిగుడ్డుతో కరోనాకు చెక్ పెట్టవచ్చని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు.

కరోనా స్పైక్ ప్రోటీన్ మన కణాలలోకి వెళ్లకుండా అడ్డుకోవడం కోసం యాంటీ బాడీలను కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు కోడిగుడ్డులో అభివృద్ధి చేశారు. పరిశోధకులు మూడు రకాల వేరువేరు టీకాలను రెండు డోసులు చొప్పున కోళ్లకు ఇచ్చారు. ఈ విధంగా టీకా చివరి డోస్ ఇచ్చిన మూడు నుంచి ఆరువారాలలో కోడిగుడ్డులోని పచ్చ సోనలో ఈ విధమైనటువంటి యాంటీ బాడీలు అభివృద్ధి చెందాయని పరిశోధకులు గుర్తించారు. ఈ క్రమంలోనే ఈ యాంటీ బాడీలు మన రక్తంలో ఏవైనా ఉంటే వాటిని శుద్ధి చేసి అవి కణాలలోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నాయో లేదో అని పరిశోధనలు చేయగా ఈ యాంటీ బాడీలో కరోనా వైరస్ బాడీలోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నట్లు పరిశోధకులు గుర్తించారు.

పక్షి జాతుల్లో ఉత్పత్తి అయ్యే ‘ఐజీవై’ రకం యాంటీబాడీలను.. మనుషుల్లో ‘ఐజీజీ’ రకం యాంటీ బాడీలతో పోల్చవచ్చు.అయితే వీటి వల్ల ఏ విధమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని ఇవి ఎక్కువగా పక్షుల సీరం అలాగే గుడ్లలో ఉంటాయి. వీటివల్ల కరోనా వ్యాప్తి చెందిన వారికి సులభంగా చికిత్స చేయవచ్చని ఈ సందర్భంగా పరిశోధకులు తెలియజేశారు. ఇలా తక్కువ ఖర్చుతోనే కరోనా మహమ్మారిని ఎదుర్కొనే యాంటీ బాడీలను తయారు చేయవచ్చని యూసీ డేవిస్‌ ప్రొఫెసర్‌ రోడ్రిగో గలార్డో తెలిపారు.