Site icon HashtagU Telugu

Anjira: కచ్చితంగా అంజూర పండ్లను తినాల్సిందే అంటున్న వైద్యులు.. ఎందుకో తెలుసా?

Mixcollage 13 Mar 2024 04 48 Pm 4025

Mixcollage 13 Mar 2024 04 48 Pm 4025

అంజూర పండ్ల వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో రకాల సమస్యలను తగ్గించుకోవచ్చు. ఇవి ఆరోగ్యానికి ఎంతో బాగా ఉపయోగపడతాయి. ఈ మధ్యకాలంలో ఇవి అన్ని సీజన్ల లోను మనకు మార్కెట్లో లభిస్తూ ఉన్నాయి. ఈ అంజీర్ పండును చాలా ప్రదేశాలను అత్తిపండు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇందులో ఎన్నో పోషక విలువలు విటమిన్లు ప్రోటీన్లు ఉన్నాయి. వీటిని తరచుగా తీసుకుంటూ ఉండటం వల్ల గ్యాస్, అజీర్తి మలబద్ధకం వంటి సమస్యలు దూరం అవుతాయి.

ఇవి మాత్రమే కాకుండా అంజూర వల్ల ఇంకా ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి.ప్రతిరోజు వీటిని తీసుకుంటుంటే అనేక రకాల అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. విటమిన్, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, సహజ చక్కెరలు అధికంగా ఉంటాయి. డ్రైఫ్రూట్స్ లో అనేక గింజలు, ఎండిన పండ్లు విత్తనాలు ఉంటాయి. అంజీరాలను తీసుకోవడంవల్ల షుగరు కంట్రోల్ లో ఉంటుంది. వీటిల్లో ప్రొటీన్, మెగ్నీషియం, ఐరన్, ఫోలేట్, విటమిన్లు సీ, కే, ఏ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అంజీరా రక్తంలో చక్కెర లెవల్స్ ను అదుపులో ఉంచుతుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తాయి.

ఇందులో సహజమైన చక్కెర ఉంటుంది. యాంటీ ఆక్షిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇన్సులిన్ ఉత్పత్తి చేసే ప్యాంక్రియాటిక్ బీటా కణాలతో సహా మిగిలిన కణాలపై రక్షిత ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఫైబర్ ఎక్కువగా ఉండటంవల్ల బరువు తగ్గుతారు. ఇంకా అనేకరకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.