Anger: కోపం (Anger) అనేది మానవుడి సాధారణ ఎమోషన్. ఏదైనా విషయం మన అంచనాలకు అనుగుణంగా జరగనప్పుడు లేదా మనం ఏదైనా విషయంతో కలత చెందినప్పుడు కోపం రావడం సహజం. ఈ రోజుల్లో తీరిక లేని జీవితంలో చాలా మంది చిన్న చిన్న కారణాల వల్ల కోపగించుకుంటున్నారు. ట్రాఫిక్ జామ్, ఆఫీస్ ఒత్తిడి, సంబంధాలలో కలత, సోషల్ మీడియాలో వివాదాలు లేదా ఇంకేదైనా కారణాల వలన కోపానికి గురవుతున్నారు. కానీ, ఈ కోపం శరీరాన్ని గమనించకుండానే క్రమంగా లోపల నుంచి బలహీనం చేస్తుందని మీకు తెలుసా?
అనేక పరిశోధనల్లో కోపం (Anger) గుండె జబ్బులు, రక్తపోటు, డిప్రెషన్, జీర్ణ సమస్యలను పెంచుతుందని నిరూపితమైంది. కోపం వచ్చిన వెంటనే గుండెపోటు (Heart Attack) వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. తరచూ అవసరానికి మించి కోపగించుకోవడం నీ ఆరోగ్యానికి ప్రాణాంతకంగా కూడా మారవచ్చు.
Also Read: New Ration Cards: రేషన్ కార్డులపై గుడ్ న్యూస్ చెప్పిన కూటమి ప్రభుత్వం!
కోపం ఎందుకు గుండెకు శత్రువుగా మారుతుంది?
గుండెపై కోపం ప్రభావం
ప్రతి వ్యక్తికి ఎప్పుడో ఒకసారి కోపం వస్తుంది. కానీ ఇది రోజువారీ అలవాటుగా మారితే సమస్య పెద్దదవుతుంది. ఈ విషయం పరిశోధనల్లో తేలింది. తరచూ కోపం రావడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. దీనివల్ల గుండెపై ఒత్తిడి పడుతుంది. ఈ ఒత్తిడి క్రమంగా గుండెపోటు ప్రమాదాన్ని సృష్టించవచ్చు. ఒక నివేదిక ప్రకారం.. కోపం వల్ల మన శరీరంలో ‘స్ట్రెస్ హార్మోన్లు’ అయిన అడ్రినాలిన్, కార్టిసాల్ పెరుగుతాయి. దీనివల్ల గుండె దడ పెరగడమే కాక, ధమనులలో వాపు, సంకోచం కూడా ప్రారంభమవుతుంది. ఇది దీర్ఘకాలంలో గుండె జబ్బులకు కారణమవుతుంది.
కోపం, మానసిక ఆరోగ్యం
ఎక్కువగా కోపగించుకునే వ్యక్తులు తరచూ మానసికంగా కూడా కలత చెందుతారు. దీని ప్రభావం నిద్ర, ఏకాగ్రత, ఆలోచనా సామర్థ్యంపై పడుతుంది. నిరంతరం కోపంలో ఉండటం వల్ల డిప్రెషన్, ఆందోళన (ఎంగ్జైటీ)తో బాధితుడవవచ్చు.
జీర్ణక్రియపై కూడా ప్రభావం
కోపం వల్ల మరో పెద్ద నష్టం ఏమిటంటే.. దీనివల్ల జీర్ణ సమస్యలు గ్యాస్, ఆసిడిటీ, అల్సర్ వంటివి సంభవించవచ్చు. అంటే కోపం మూడ్‌ను మాత్రమే కాదు పొట్టను కూడా చెడగొట్టవచ్చు.
కోపాన్ని ఎలా నియంత్రించాలి?
- కోపం వచ్చినప్పుడు లోతైన శ్వాస తీసుకుని ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించాలి.
- యోగా, ధ్యానం తప్పక చేయాలి.
- శారీరక వ్యాయామం చేయాలి. తద్వారా ఒత్తిడి బయటకు వస్తుంది.
- అవసరమైతే ఒక కౌన్సెలర్ లేదా డాక్టర్‌తో మాట్లాడాలి.