ENT Specialists: శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాల్సిన అవసరం అనారోగ్యం పాలైన తర్వాత కాదు. అనారోగ్యం రాకముందే అని అర్థం చేసుకోవాలి. అందుకే ‘ప్రివెంటివ్ లైఫ్ స్టైల్’ (ముందస్తు ఆరోగ్య జీవనశైలి) గురించి చెబుతారు. సరైన జీవనశైలి అలవాట్లను పాటిస్తే ఆరోగ్య సమస్యలు దూరంగా ఉంటాయి. అయితే చాలామంది శరీరంలోని ఇతర భాగాలపై దృష్టి పెడతారు కానీ కళ్లు, చెవులు, ముక్కులను విస్మరిస్తారు. తెలియక చేసే కొన్ని పనుల వల్ల వీటిని ప్రమాదంలో పడేస్తారు. ఈఎన్‌టీ నిపుణుల ప్రకారం.. ఎప్పటికీ చేయని 3 పనుల గురించి తెలుసుకుందాం. నిపుణులు చెప్పినట్లుగా మీరు కూడా మీ కళ్లు, చెవులు, ముక్కులను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఆ 3 పనులు ఏమిటో ఇక్కడ తెలుసుకోండి.
ఎప్పటికీ చేయకూడని 3 పనులు
పర్ఫ్యూమ్ లేదా డియోడరెంట్: ఎప్పుడూ పర్ఫ్యూమ్స్, పౌడర్ లేదా డియోడరెంట్లను ఉపయోగించకూడదని నిపుణులు చెప్పారు. ఇవి కళ్లు, ముక్కుకు చికాకు (ఇరిటేషన్) కలిగించే సాధారణ కారకాలు అని పేర్కొన్నారు.
ముక్కుకు లూబ్రికేషన్: ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు ముక్కులో ఆయిల్ వంటి లూబ్రికెంట్ రాసుకోకుండా నిద్రపోకూడదని తెలిపారు.
దంతాల శుభ్రత: పడుకునే ముందు బ్రష్ చేయడం, కుకిలించడం (గగ్లింగ్) చేయకుండా ఎప్పుడూ నిద్రపోకూడదని వివరించారు. నోటి ఆరోగ్యం (ఓరల్ హెల్త్) కోసం ఇది చాలా అవసరం. అలాగే ప్రతిరోజూ రాత్రి ‘వాటర్ ఫ్లాస్’ (Water Floss) చేయడం కూడా తప్పనిసరి అని పేర్కొన్నారు.
Also Read: బీహార్ రాజకీయాల్లో పెను మార్పు.. జాతీయ రాజకీయాల వైపు నితీష్ అడుగులు!
ఈ విషయాలను కూడా గుర్తుంచుకోవడం అవసరం
చెవులను శుభ్రం చేయడానికి ఎప్పుడూ కాటన్ స్వ్యాబ్స్ లేదా కాటన్ బడ్స్ ఉపయోగించకూడదు. దీనివల్ల చెవిలోని మైనం (వ్యాక్స్) తొలగిస్తుందో లేదో తెలియదు కానీ చెవికి ఉండే రక్షణ కవచం దెబ్బతిని సమస్యలు పెరిగే అవకాశం ఉంది. ముక్కులోని వెంట్రుకలను వేళ్లతో లాగడం లేదా తొలగించడం మానుకోవాలి. ముక్కులోని వెంట్రుకలు గాలిలోని దుమ్ము, అలర్జీ కలిగించే కణాలు, క్రిములను లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటాయి. వాటిని తొలగిస్తే ముక్కులో గాయాలు అవ్వడమే కాకుండా, ఇన్ఫెక్షన్లు, అలర్జీలు పెరిగే ప్రమాదం ఉంది. ఎప్పుడూ ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడం మానుకోవాలి. ఇది వినికిడి సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. ముఖ్యంగా ఎక్కువ శబ్దంతో పాటలు వినకూడదు. మీ కళ్లను ఎప్పుడూ రుద్దకూడదు. దీనివల్ల కంటి సంబంధిత సమస్యలు పెరుగుతాయి.
