Amla : ఉసిరికాయను తినడం వల్ల కలిగే లాభాల గురించి తెలిస్తే తినకుండా అస్సలు ఉండలేరు?

ఉసిరికాయ (Amla) పచ్చడిని ఇష్టపడి తింటూ ఉంటారు. మీకు తెలుసా ఈ ఉసిరికాయను ప్రతిరోజు తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి.

Amla : ఉసిరికాయ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. మామూలుగా ఉసిరికాయ వగరుగా, పుల్ల పుల్లగా ఉంటుంది. ఈ ఉసిరిని అనేక రకాల వంటల్లో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఈ కాయలు వగరుగా ఉన్నా సరే కొందరు ఉప్పు కారం నంచుకొని ఎంతో బాగా తింటూ ఉంటారు. చాలామంది ఉసిరికాయ (Amla) పచ్చడిని ఇష్టపడి తింటూ ఉంటారు. మీకు తెలుసా ఈ ఉసిరికాయను ప్రతిరోజు తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా ఉసిరికాయ (Amla) వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలిస్తే మాత్రం వాటిని తినకుండా అస్సలు ఉండలేరు. ఉసిరిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

We’re now on WhatsApp. Click to Join.

ఇందులో ఉండే విటమిన్లు, మినరల్స్ శరీరానికి ఎంతో ఆరోగ్యాన్ని అందిస్తాయి. అందుకు ఉసిరికాయను మనం రోజూ ఆహారంలో భాగంగా చేసుకోవాలని వైద్యులు కూడా చెబుతూ ఉంటారు. ఉసిరికాయను ప్రతి రోజూ ఒక్కటి తినడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఉసిరికాయను నిత్యం తీసుకోవడం వల్ల డయాబెటిస్ రోగులకు చాలా మేలు చేస్తుంది. రక్తంలో ఉండే షుగర్ లేవల్స్ ను ఉసిరికాయ కంట్రోల్ లో ఉంచుతుంది. అలాగే ఉసిరికాయలో ఉండే ఫైబర్ శరీరంలో వెంటనే కరిగిపోవడం వల్ల ఎన్నో సమస్యలకు చెక్ పెట్టే అవకాశం ఉంటుంది. ఉసిరికాయలో విటమిన్ సీ అధికంగా ఉంటుంది. అలాగే ఇది ఇతర పోషకాలను కూడా గ్రహించడంలో ఎంతో బాగా ఉపయోగపడుతుంది.

ఉసిరిలో ఉండే విటమిన్ సీ వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు వెంటనే నయం అవుతాయి. అలాగే ఉసిరిలో విటమిన్ ఏ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యాన్ని బాగా మెరుగుపరుస్తుంది. కళ్లలో వచ్చే ఎటువంటి సమస్యలను అయినా ఉసిరి చెక్ పెడుతుంది. అందుకే ఉసిరిని రోజూ ఆహారంలో భాగంగా చేసుకుంటే కావాల్సినంత రోగ నిరోధక శక్తి లభిస్తుంది. ఉసిరికాయ యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉండటం వల్ల శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్ ను నాశనం చేస్తాయి. అలాగే ఉసిరి మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది.

Also Read:  Tillu Square: టిల్లు స్క్వేర్‌ విడుదల తేదీలో మార్పు.. విడుదల తేదీ ఎప్పుడంటే?