Site icon HashtagU Telugu

Health Tips: పులిపిర్లతో బాధపడుతున్నారా.. అయితే ఇలా చేస్తే చాలు నొప్పి లేకుండా పులిపిర్లు మాయం అవ్వాల్సిందే?

Mixcollage 19 Dec 2023 07 19 Pm 6352

Mixcollage 19 Dec 2023 07 19 Pm 6352

మామూలుగా చాలామందికి పులిపిర్ల సమస్య ఇబ్బంది పెడుతూ ఉంటుంది. శరీరంలో ఎక్కడపడితే అక్కడ పెద్ద పెద్ద పులిపిర్లు లేసి అందవిహీనంగా కనిపిస్తూ ఉంటుంది. కొందరికి మెడ భాగం లేదా ముఖం భాగంలో ఎక్కువగా ఈ పులిపిర్లు వస్తూ ఉంటాయి. అయితే ఈ పులిపిర్లు రావడానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. ఇవి బరువు ఎక్కువగా ఉండడం వలన వైరస్ల వల్ల గాని ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాపించడం వలన కానీ వస్తూ ఉంటాయి. చాలామంది వీటిని తగ్గించుకోవడం కోసం ట్రీట్మెంట్ చేయించుకోవడంతో పాటు రకరకాల హోమ్ రెమిడీలను కూడా ఫాలో అవుతూ ఉంటారు.

కానీ వాటి వల్ల సరైన ఫలితాలు లభించగా దిగులు చెందుతూ ఉంటారు. అయితే మీరు కూడా పులిపిర్ల సమస్యతో బాధపడుతుంటే ఇప్పుడు మనం తెలుసుకోబోయే చిట్కాలు పాటిస్తే చాలు ఆ పులిపిర్ల సమస్య నుంచి ఈజీగా బయటపడవచ్చు. మరి అందుకోసం ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మొదట ఒక బౌల్ ని తీసుకొని దాంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ తమలపాకులో వాడే సున్నం వేసుకోవాలి. తర్వాత ఒక అర చెంచా పసుపు కూడా కలుపుకోవాలి. తర్వాత దీంట్లో ఒక అరచెంచా వంట సోడా కూడా కలుపుకోవాలి. ఈ మూడింటిని కొద్దిగా నీటిని వేసి పేస్ట్ లాగా బాగా కలుపుకోవాలి. ఇది మరీ పల్చగా అవ్వకూడదు. మీరు నొప్పిని తట్టుకుంటాం అనే వాళ్ళు వంట సోడాకు బదులుగా నిమ్మరసం కూడా వాడుకోవచ్చు.

ఈ నిమ్మరసం వల్ల కొద్దిగా నొప్పి అలాగే మంట కలుగుతుంది. దీనిలో పసుపు సున్నం కలపడం వలన మిశ్రమం రంగు ఎరుపు రంగులోకి మారుతుంది. ఈ విధంగా తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని పులిపర్ల ఉన్న ప్రదేశంలో చిన్నగా అప్లై చేసుకోవాలి. ఈ విధంగా చేసిన తరువాత ఒక 10 నిమిషాలు పాటు అలా వదిలేయాలి. కొద్దిసేపు తర్వాత సాధారణమైన నీటితో ముఖంని క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా రోజుకి మూడుసార్లు అప్లై చేయాలి. పులిపర్ల సైజును బట్టి అవి సమయం ఎక్కువ అవుతూ ఉంటుంది. చిన్న పరిమానంలో ఉండేవి రెండు మూడు రోజుల్లో తగ్గిపోతాయి. పెద్ద సైజులో ఉండే పులిపర్లు రాలిపోవడానికి కొద్దిగా ఎక్కువ సమయమే పడుతుంది. ఈ చిట్కాని వాడేటప్పుడు కంటి దగ్గర కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ విధంగా రోజుకు మూడుసార్లు ఉపయోగించడం వలన మీ పులిపర్లు అలాగే మచ్చలు కూడా తగ్గిపోతాయి.