Health Benefits: చలికాలంలో తులసి ఆకులు తీసుకోవడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాల గురించి మీకు తెలుసా?

మామూలుగా చలికాలం మొదలైంది అంటే చాలు సీజనల్ వ్యాధులు మొదలవుతూ ఉంటాయి. దాంతోపాటు చలికాలంలో అనేక రకాల చర్మ సమస్యలు జుట్టు స

Published By: HashtagU Telugu Desk
Mixcollage 13 Dec 2023 06 13 Pm 7866

Mixcollage 13 Dec 2023 06 13 Pm 7866

మామూలుగా చలికాలం మొదలైంది అంటే చాలు సీజనల్ వ్యాధులు మొదలవుతూ ఉంటాయి. దాంతోపాటు చలికాలంలో అనేక రకాల చర్మ సమస్యలు జుట్టు సమస్యలు కూడా మొదలవుతూ ఉంటాయి. దాంతో ఆ సమస్యలకు పెట్టడానికి చాలామంది ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే వాటికి బదులుగా ఆయుర్వేద చిట్కాలను ఉపయోగిస్తే ఎన్నో రకాల మంచి ఫలితాలు ఉంటాయి అంటున్నారు వైద్యులు. ముఖ్యంగా చలికాలంలో తులసి ఆకులను తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అంటున్నారు. మరి తులసి ఆకులను తీసుకుంటే చలికాలంలో ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

తులసి ఆకులలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ ,యాంటీ ఫంగల్ మొదలైన లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి పలు శారీరక సమస్యల నుంచి బయటపడేస్తుంది. తులసి ఆకులు గుండెల్లో మంట అజీర్ణం లాంటి ఎన్నో సమస్యల నుంచి ఉపశమనం కలిగేలా చేస్తాయి. ఈ తులసి మొక్కను మన హిందూ సాంప్రదాయాలు ఎంతో పవిత్రంగా కొలుస్తూ ఉంటారు. ఈ మొక్క ప్రతి ఇంట్లోనూ ఉంటుంది. దీనిని ఆరాధిస్తూ ఉంటారు. ఇక ఆయుర్వేదంలో దీనికి ఎంతో గొప్ప ప్రాధాన్యత ఉంది. దీని వలన కొన్ని వ్యాధులు తగ్గిపోతాయి..bఅలాగే శీతాకాలంలో తులసి ఆకులతో బోలెడు ఉపయోగాలు ఉన్నాయి. నిత్యం ఉదయం ఖాళీ కడుపుతో తులసి ఆకుల్ని తీసుకుంటే దగ్గు, జలుబు లాంటి సమస్యలు తగ్గిపోతాయి. గొంతు నొప్పి ,ముక్కు మూసుకుపోవడం లాంటి సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది.

అలాగే తులసి ఆకులు గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వీటిని కాళీ కడుపుతో తీసుకుంటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. దీనిలో ఉండే పోషకాలు కొలెస్ట్రాల్ రక్తపోటును కంట్రోల్ చేస్తాయి. అలాగే గుండెపోటు లాంటి సమస్యలను తగ్గిస్తుంది. నోటి దుర్వాసన సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు తులసి ఆకులను నిత్యం నమిలి తీసుకోవాలి. ఇలా చేస్తే అందులో ఉండే గుణాలు నోట్లోని బ్యాక్టీరియాని చంపి నోటి దుర్వాసన తగ్గిస్తాయి. తులసి ఆకులను ఖాళీ కడుపుతో తీసుకోవడం వలన కడుపు సమస్యలు ఉండవు. జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే పొత్తికడుపు సమస్యలు తగ్గిపోతాయి. అలాగే ఈ ఆకులు ఎసిడిటీ, మలబద్దకం, ఆ జీర్ణం, పుల్లటి తేపులు లాంటి సమస్యలు కూడా తగ్గిపోతాయి. నిత్యం ఉదయం తులసి ఆకులను తీసుకోవడం వలన చర్మం మెరిసిపోతూ ఉంటుంది. తులసి ఆకులలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు చర్మం లోకి లోతుగా చర్చుకుపోయి శుభ్రం చేస్తూ ఉంటాయి. అలాగే మొటిమలు కూడా తగ్గిపోతాయి.

  Last Updated: 13 Dec 2023, 06:13 PM IST