Site icon HashtagU Telugu

Papaya Seed Benefits: బొప్పాయి గింజలతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు

Papaya Seed Benefits

New Web Story Copy 2023 06 01t175737.477

Papaya Seed Benefits: మనిషికి ఆహారం ఎంత ముఖ్యమో పండ్లు కూడా అంతే అవసరం. దైనందిన జీవితంలో ఫ్రూట్స్ తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తూ ఉంటారు. పండ్లలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. బొప్పాయి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బొప్పాయిను నిత్యం తింటే అనేక రోగాలను దూరం చేసుకోవచ్చు. కానీ బొప్పాయితో పాటు దాని విత్తనాలు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అందులో ఎన్నో పోషకాలు ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. కాల్షియం, ఫాస్పరస్, మోనోశాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు మరియు అనేక ఇతర మూలకాలు వీటిలో ఉంటాయి. అంతేకాక ఆరోగ్యపరమైన అనేక సమస్యలను తొలగించడంలో బొప్పాయి విత్తనాలు ప్రభావవంతంగా చూపిస్తాయి.

బొప్పాయి గింజల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. వీటిలో ఉండే గుణాలు పేగు కదలికను సులభతరం చేస్తాయి. అలాగే శరీరం నుండి విష పదార్థాలను తొలగించడంలో సహాయపడతాయి. దీని వల్ల కడుపు సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.

బొప్పాయిలో కెరోటిన్ ఉంటుంది, ఇది శరీరంలో ఈస్ట్రోజెన్ వంటి హార్మోన్లను నియంత్రించడంలో సహాయపడుతుంది. పీరియడ్స్ సమయంలో వచ్చే క్రాంప్స్‌ని తగ్గించడంలో ఈ గింజలు బాగా సహాయపడుతాయి.

బొప్పాయి గింజలలో యాంటీ ఫంగల్ లక్షణాలు కనిపిస్తాయి. ఇది చుండ్రును తొలగించడంలో సహాయపడుతుంది. మీరు చుండ్రు సమస్యతో ఇబ్బంది పడుతుంటే, ఖచ్చితంగా ఈ గింజల సారాన్ని మీ తలపై అప్లై చేయండి. దీని నుంచి ఉపశమనం పొందవచ్చు.

విటమిన్-సి, ఫ్లేవనాయిడ్స్, ఆల్కలాయిడ్స్ మరియు పాలీఫెనాల్స్ బొప్పాయి గింజల్లో తగినంత పరిమాణంలో ఉంటాయి. ఇది శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. అదనంగా ఈ విత్తనాలలో ఉండే మోనోశాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తాయి.

మెరిసే చర్మం కోసం బొప్పాయి గింజలను ఉపయోగించవచ్చు. వీటిలో యాంటీ ఏజింగ్ గుణాలు ఉన్నాయి. ఇది చర్మంపై ముడతలను తగ్గించడంలో సహాయపడుతుంది.

Read More: Health Tips: పొరపాటున కూడా కలిపి తినకూడని పండ్లు ఇవే.. తింటే అంతే సంగతులు?