Papaya Benefits: బొప్పాయి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే.. తినకుండా అస్సలు ఉండలేరు?

బొప్పాయి వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ మధ్యకాలంలో బొప్పాయి మనకు ఏడాది పొడవున్న లభిస్తోంది. బొ

  • Written By:
  • Publish Date - September 19, 2023 / 05:46 PM IST

బొప్పాయి వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ మధ్యకాలంలో బొప్పాయి మనకు ఏడాది పొడవున్న లభిస్తోంది. బొప్పాయిలో విటమిన్‌ సి, యాంటీఆక్సిడెంట్లు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. భోజనం తర్వాత బొప్పాయి తింటే ఆహారం చక్కగా జీర్ణమవుతుంది. పొట్ట, పేగుల్లో విషపదార్థాల్ని తొలగిస్తుంది. అంతేకాకుండా ఇంకా ఎన్నో రకాల ప్రయోజనాలను కూడా చేకూరుస్తుంది.
బొప్పాయిలోని ప్లేవనాయిడ్స్‌, పొటాషియం, మినరల్స్‌, కాపర్‌, మెగ్నిషియం, ఫైబర్‌ వంటి పోషకాలు మనకు ఎంతో మేలు చేస్తాయి.

డెంగీ ఫీవర్‌తో బాధపడేవారికి ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గిపోతుంది. అలాంటి వారు తప్పనిసరిగా బొప్పాయి తినాలి. ఫలితంగా ప్లేట్ లెట్స్ మళ్లీ వేగంగా పెరుగుతాయి. బొప్పాయి ఆకుల రసం తాగినా చక్కటి ఫలితం ఉంటుంది. బొప్పాయిలో క్యాలరీలు తక్కువే. అందువల్ల ఎక్కువగా తిన్నా కూడా బరువు పెరిగే అవకాశం ఉండదు. ఇది చెడు కొవ్వును తరిమేస్తుంది. గుండెకు రక్తం చక్కగా సరఫరా అయ్యేలా చేస్తుంది. అలాగే మూత్ర పిండాల్లో రాళ్లు ఉండేవారికి బొప్పాయి సరైన మందు. దీనిని తరచుగా తీసుకోవడం వల్ల మూత్రపిండాల్లో ఏర్పడే రాళ్లను అరికట్టవచ్చు. అలసట, నీరసం వంటి అనారోగ్య సమస్యల్ని బొప్పాయి తొలగిస్తుంది.

ఎర్ర రక్త కణాల సంఖ్య పెరిగి బలం వస్తుంది. కాన్సర్‌‌పై పోరాడే గుణాలు బొప్పాయిలో ఉన్నాయి. ఇందులో బీటాకెరోటిన్‌, లూటిన్‌ వంటి యాంటీ ఆక్సిడెంట్లు కాన్సర్‌ వైరస్‌తో పోరాడతాయి. ఇది కొలన్‌, గర్భాశయ కాన్సర్‌లను తగ్గిస్తుంది. బొప్పాయి అప్పుడప్పుడూ తింటూ ఉండటం వల్ల కళ్లు చల్లగా, ఆరోగ్యంగా ఉంటాయి. బొప్పాయి విటమిన్ ఎ, బీటా కెరోటిన్, జియాక్సంతిన్, సైప్టోక్సంతిన్, లుటిన్ వంటి విటమిన్లను, ఫ్లేవనాయిడ్లు ను కలిగి ఉండటం వల్ల వయస్సు పెరగటం వల్ల వచ్చే కంటి చూపు సమస్యలను తగ్గిస్తుంది. బీపీ, షుగర్ ఉన్నవాళ్లు కూడా బొప్పాయి తింటే మంచిదే. రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడే యాంటీఆక్సిడెంట్స్, విటమిన్-C అధికంగా కలిగి ఉండటం వల్ల రోగ నిరోధక శక్తిని పెంచటంతో పాటు శరీరానికి హాని కలిగించే వాటినుంచి కణాలను కాపాడుతుంది.