Onion: ఉల్లిపాయను ఉడకబెట్టి తింటే ఏం జరుగుతుందో తెలుసా?

సాధారణంగా మనం ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అనే సామెతను వినే ఉంటాం. ఎందుకంటే ఉల్లిపాయ వల్ల

  • Written By:
  • Publish Date - March 16, 2023 / 06:30 AM IST

సాధారణంగా మనం ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అనే సామెతను వినే ఉంటాం. ఎందుకంటే ఉల్లిపాయ వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఉల్లిపాయను డైరెక్టుగా అయినా తినవచ్చు లేదంటే ఏదైనా వంటలో రూపంలో అయినా కూడా తీసుకోవచ్చు. ఉల్లిపాయను తరుచూ తీసుకోవడం వలన రక్తము శుద్ధి అవుతుంది. శ్వాసక్రియకు ఇబ్బంది కలిగించే ఆయాసము, జలుబు వంటి ఊపిరితిత్తుల వ్యాధుల నుండి బయటపడవచ్చు. కొన్ని కొన్ని కార్లు మనకు ముక్కు బెదిరి రక్తం వస్తూ ఉంటుంది. అటువంటి సమయంలో ఉల్లిపాయను నలిపి వాసన పీల్చాలి. అలా చేయడం వల్ల రక్తస్రావం అరికట్టబడుతుంది.

ఉల్లిపాయను తరిగేటప్పుడు కళ్ళ వెంట నీరు రావడం అన్నది సహజం. కానీ అలా నీళ్ళు రావడం వలన కళ్ళు శుభ్రపడతాయి. కడుపులో బల్ల పెరిగినా, కడుపుకు నీరు పట్టి బాగా కడుపు ఉబ్బుతున్నట్లు అనిపిస్తే నీరుల్లిపాయను ఉడక బెట్టి ప్రతిపూట తినడం వల్ల ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. కీళ్ళనొప్పులు, వాపులు ఉన్నవారు, నీరు ఉల్లి పాయలను పొయ్యిలో వేసి కాల్చి మెత్తగా నూరి ఆ పదార్థంతో మందంగా పట్టు వేస్తే నొప్పులు తగ్గుతాయి. అలాగే శరీరంలో తిమ్మెరలు అధికంగా వున్నపుడు రోజుకు మూడుసార్లు పచ్చి నీరుల్లిపాయను బాగ నూరి ఆ గుజ్జుతో మర్దన చేయడం వలన రక్తప్రసరణ సరిగ్గా జరిగి తిమ్మెరలుపోతాయి.

తేలు కుట్టినప్పుడు ఉల్లిపాయ గుజ్జును రుద్దితే ఉపశమనంగా వుంటుంది. ఉల్లిపాయల్లోని ఆర్గనో సల్ఫర్‌ మూలకాల కారణంగా పొట్ట, గొంతు, పేగు క్యాన్సర్లు రాకుండా ఉంటాయి. అంతేకాదు, వీటిల్లో ఉండే విటమిన్‌-సి క్యాన్సర్‌ కారకాలైన ఫ్రీ రాడికల్స్‌ను సమర్థంగా అడ్డుకుంటుంది. ఇంకా ఉల్లిపాయలు ఎక్కువగా తీసుకునే పురుషుల్లో ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం కూడా తక్కువ.పచ్చి ఉల్లిపాయను నమలడంవల్ల నోట్లోని బ్యాక్టీరియా పోయి దంతాలూ చిగుళ్లూ పుచ్చిపోకుండా ఉంటాయి. పచ్చి ఉల్లిపాయ తింటే చెడు కొలెస్ట్రాల్‌ కూడా తగ్గుతుంది.