సపోటా పండు వల్ల ఎన్నో రకాల లాభాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. వీటిని చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు ఇష్టపడి తింటూ ఉంటారు. ఇవి చాలా తియ్యగా ఉంటాయి అన్న విషయం తెలిసిందే. వీటిని షుగర్ పేషెంట్లు తక్కువగా తినాలని చెబుతూ ఉంటారు. సపోటా లో ఉండే విటమిన్ ఏ కళ్లకు చాలా మంచిది. అలాగే సహజసిద్ధమైన గ్లూకోజ్ ఉంటుంది. ఇది తగినంత శక్తిని అందిస్తుంది. మలబద్ధకంతో ఇబ్బంది పడేవారు రోజు సపోటా పండును తినడం వల్ల ఆ సమస్య నుంచి బయటపడవచ్చు అని చెబుతున్నారు. అలాగే ఈ సపోటా పండు రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది.
దీన్ని తినడం వల్ల శరీరానికి కావాల్సిన శక్తి అందుతుందట. అలాగే నిద్రలేమితో బాధపడేవారు ఈ పండు తింటే ప్రశాంతంగా నిద్రపోతారని, సపోటా పండును తీసుకోవడం వల్ల వృద్ధాప్య చర్మాన్ని కూడా దూరం చేస్తుందని చెబుతున్నారు. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు కూడా సపోటా తీసుకోవడం వల్ల ప్రయోజనం పొందవచ్చని, సపోటా పండ్లు నరాల ఒత్తిడి, బలహీనతను తగ్గించడంలో సహాయపడతాయని, ఈ పండ్లను తింటే కిడ్నీలో రాళ్ల సమస్య తగ్గుతుందని చెబుతున్నారు. అధిక బరువు జుట్టు రాలడం తగ్గించడంలో సపోటా పండు ఎంతో బాగా ఉపయోగపడుతుందట.
ఈ రెండు రకాల సమస్యలతో బాధపడుతున్న వారు తరచుగా సపోటా పనులు తినాలని చెబుతున్నారు. ఇవి శరీరంలోని ఇన్ఫ్లమేషన్ ను అనేక విధాలుగా తగ్గించడంలో సహాయపడతాయట. సపోటా లోని విటమిన్ ఎ ఊపిరితిత్తులు, నోటి క్యాన్సర్ రాకుండా కాపాడుతుందని, సపోటాలో కాల్షియం, ఫాస్పరస్, ఐరన్ అధికంగా ఉంటాయి. ఇవి ఎముకలను బలపరుస్తాయని చెబుతున్నారు. కాబట్టి తరచుగా సపోటా పండ్లను తినడం ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతున్నారు.