Guava Benefits: వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఇవే..?

సాధారణంగా పండ్లలో ఎన్నో పోషకాలు ఉంటాయి అన్న విషయం మనకు తెలిసిందే. ఈ పండ్లలో ఒకటైన జామ

Published By: HashtagU Telugu Desk
Black Guava

Black Guava

సాధారణంగా పండ్లలో ఎన్నో పోషకాలు ఉంటాయి అన్న విషయం మనకు తెలిసిందే. ఈ పండ్లలో ఒకటైన జామ పండులో వివిధ రకాల పోషక విలువలు దాగి ఉన్నాయి. అయితే కేవలం జామ పండులో మాత్రమే కాకుండా జామ చెట్టు బెరడు,ఆకులలో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. అయితే సాధారణంగా మనం ఎక్కువగా ఆకుపచ్చ రంగు లేదా లేత పసుపు రంగులో ఉన్న జామకాయలను మాత్రమే చూసి తిని ఉంటాం. వీటితో పాటుగా ప్రస్తుతం మార్కెట్ లో నలుపు రంగులో ఉండే జామ పండ్లు కూడా అందుబాటులోకి వచ్చాయి.

అయితే ఈ నల్ల జామపండు చూడటానికి బయట వైపు నలుపు రంగులో ఉన్నప్పటికీ లోపల గులాబి రంగులో ఉంటుంది. ఇందులో సాధారణ జామపండుతో పోలిస్తే మూడు రెట్లు అధికంగా పోషక విలువలు ఉంటాయి. నల్ల జామకాయలో విటమిన్స్, ఖనిజాలు, క్యాల్షియం, ఐరన్ పుష్కలంగా లభిస్తాయి. ఈ నల్ల జామ పండు తినడం వలన రక్తహీనత సమస్యను తగ్గించి రక్తం వృద్ధి చెందేలా చేస్తుంది. అయితే రక్తహీనత సమస్యతో బాధపడుతున్న వారిని వీటిని తరచుగా తినడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి. నల్ల జామకాయలో యాంటీఏజింగ్ గుణాలు ఉన్నాయి.

ఇది వృద్ధాప్యాన్ని నివారించడంలో బాగా ఉపయోగపడుతుంది. ఈ పండు తీసుకోవడం వలన వృద్ధాప్య ఛాయలను దరి చేరనివ్వకుండా చేస్తుంది. అలాగే చర్మం పై ఉన్న ముడతలు తొలగించి యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. యవ్వనంగా కనిపించలనుకునేవారు ఈ పండును ఖచ్చితంగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే మాములు జామ పండు తో పోలిస్తే ఈ నల్లజామలో కంటి సమస్యలను తగ్గించే గుణాలు ఉన్నాయట. కంటి ఆరోగ్యాన్ని కాపాడతాయి. నల్ల జామకాయ మలబద్దకం సమస్యను కూడా నివారిస్తుంది.

  Last Updated: 17 Aug 2022, 11:13 PM IST