Thotakura : తోటకూర తింటే అలాంటి ఆ సమస్యల నుంచి విముక్తి దక్కుతుంది…!!

తోటకూరే కదా అని తేలిగ్గా తీసిపారేస్తున్నారా...? అయితే మీరు పొరపాటు పడినట్లే..!!ఎందుకంటారా..తోటకూరలో ఆరోగ్యానికి మేలు చేసే విషయంలో అమ్మలాంటిదే అని చెప్పొచ్చు..!

  • Written By:
  • Publish Date - June 20, 2022 / 10:00 AM IST

తోటకూరే కదా అని తేలిగ్గా తీసిపారేస్తున్నారా…? అయితే మీరు పొరపాటు పడినట్లే..!!ఎందుకంటారా..తోటకూరలో ఆరోగ్యానికి మేలు చేసే విషయంలో అమ్మలాంటిదే అని చెప్పొచ్చు..!దీన్నే అమరాంథస్, చౌలాయ్ గా పేర్కొంటారు. తోటకూరలోనూ ఎన్నో రకాలున్నాయి. కానీ ఇవన్నీ ఒకటే. చౌకగా లభించే తోటకూరను తరచుగా తీసుకుంటే…ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

ఆకుపచ్చని కూరగాయలు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని తరచుగా వింటూనే ఉంటాం. పాలకూర, మెంతికూర, క్యాబేజికి ఎక్కువ మంది ప్రాధాన్యం ఇస్తారు. కానీ తోటకూరను తినేవారు చాలా అరుదుగా ఉంటారు. తోటకూరను తరచుగా తినడం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఇందులో ఫైబర్ ఎక్కువ శాతం ఉంటుంది. హానికలిగించే ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. అంతేకాదు టోకోట్రెనోల్స్ అనే ఒకరకమైన విటమిన్ ఇ కూడా తోటకూరలో పుష్కలంగా ఉంటుంది. ఇది కూడా కొలెస్ట్రాల్ తగ్గించడంలో సాయపడుతుంది.

తోటకూర యాంటీహైపర్ గ్లైసిమిక్ గా పనిచేస్తుంది. దీనివల్ల రక్తంలో గ్లూకోజ్ తగ్గుతుంది. కాబట్టి టైప్ -2 మధుమేహంతో బాధపడుతున్నవారికి తోటకూర మేలు చేస్తుంది. రక్తంలో ఇన్సులిన్ స్థాయిలను తగ్గిస్తుంది. ఆకలిని తగ్గించే హార్మోన్ ను రిలీజ్ చేస్తుంది. కాబట్టి వెంటనే ఆకలిగా అనిపించదు.

ఇక ఎముకలు బలంగా ఉండేందుకు కాల్షియం అవసరం. తోటకూర నుంచి మన శరీరానికి కావల్సిన కాల్షియం అందుతుంది. కాబట్టి తోటకూర తీసుకుంటే ఆస్టియోపోరోసిస్ సమస్యను అధిగమించవచ్చు. తోటకూరలో కీలకమైన లైసిన్ కూడా ఉంటుంది. ఇదొక అమైనో యాసిడ్ లా పనిచేస్తుంది. విటమిన్ ఇ, ఐరన్, మెగ్నీషియం, పాస్పరస్, పొటాషియం, విటమిన్ సి ఉన్నాయి. కాబట్టి శరీరానికి హాని కలిగించే ఫ్రీరాడికల్స్ , కేన్సర్ పై పోరాటానికి సాయపడుతుంది.