Health Benefits: నిత్యం పెరుగులో ఇది కలిపి తీసుకుంటే చాలు.. కలిగే లాభాలు ఎన్నో?

పెరుగు తినడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికి తెలిసిందే. ప్రతిరోజు పెరుగు తినడం వల్ల ఎన్నో రకాల లాభాలు కూడా ఉన్నాయి.

Published By: HashtagU Telugu Desk
Mixcollage 28 Dec 2023 05 08 Pm 1087

Mixcollage 28 Dec 2023 05 08 Pm 1087

పెరుగు తినడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికి తెలిసిందే. ప్రతిరోజు పెరుగు తినడం వల్ల ఎన్నో రకాల లాభాలు కూడా ఉన్నాయి. పెరుగు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కొందరికి పెరుగు తినకపోతే ఆరోజు ఆహారం తీసుకున్నట్లే అనిపించదు. పెరుగులో ప్రోటీన్, మ్యాగ్నీషియం, క్యాల్షియం, పొటాషియం లాంటి పోషకాలు ఉంటాయి. అయితే ఈ పెరుగు రోటితో కలిపి తీసుకున్నట్లయితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ఎన్నో రకాల పోషకాలు కలిగి ఉన్నాయి. పెరుగుతో పాటుగా రోటి కలిపి తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

పెరుగులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. రోటి శరీరానికి రోగ నిరోధక శక్తిని పెంచడానికి బాగా సహాయపడుతుంది. నిత్యం పెరుగు, రోటీని కలిపి తీసుకోవడం వలన దగ్గు, జలుబు వంటి వైరల్ తో వ్యాధుల నుండి రక్షిస్తుంది. పెరుగులో కాల్షియం ప్రోటీన్ అధికంగా ఉండడం వలన ఎముకలు బలంగా మారుతాయి. అదేవిధంగా నిత్యం రోటీని, పెరుగు కలిపి తీసుకోవడం వలన ఎముక పగుళ్లు, కీళ్ల నొప్పుల వ్యాధులు కూడా తగ్గుతాయి. అలాగే పెరుగులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అదేవిధంగా పెరుగుని, రోటితో పాటు తీసుకోవడం వలన ఆందోళనను, ఒత్తిడిని తగ్గించడంలో బాగా దోహదపడుతుంది.

ఇది తీసుకోవడం వలన సంతోషంగా, ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. పెరుగు, రోటితో కలిపి తీసుకోవడం వలన చాలా ఈజీగా డైజేషన్ అవుతుంది. జీర్ణశక్తి కూడా మెరుగుపడుతుంది. పొట్టకి సంబంధించిన సమస్యలు కూడా తగ్గిపోతాయి. పెరుగు ఉత్తమ ప్రోబయోటిక్ కి మంచి మూలం. అదేవిధంగా రోటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. కాబట్టి ఈ ఆహారం తీసుకోవడం వలన ప్రేగులలో మంచి బ్యాక్టీరియా మెరుగుపడుతుంది. అలాగే అజీర్ణం, గ్యాస్, మంట, ఉబ్బరం, మలబద్ధకం లాంటి ఇబ్బందులు కూడా తగ్గిపోతాయి.

  Last Updated: 28 Dec 2023, 05:09 PM IST