Site icon HashtagU Telugu

Carrot: ప్రతిరోజు క్యారెట్లు తినడం మంచిదేనా.. ఈ అలవాటు వల్ల ఏమైనా సమస్యలు వస్తాయా?

Carrot

Carrot

మన వంటింట్లో దొరికే కాయ కూరలలో కొన్నింటిని మనం మాత్రమే మనం పచ్చిగా ఉన్నప్పుడు కూడా తినగలం. వాటిలో క్యారెట్ కూడా ఒకటి. కొంతమంది క్యారెట్ ని కూరల రూపంలో తీసుకుంటే మరికొందరు స్వీట్ల రూపంలో కూడా తీసుకుంటూ ఉంటారు. క్యారెట్ ఎన్నో రకాల పోషకాలు కలిగిన కూరగాయ. క్యారెట్లలో ఫైబర్స్, బీటా కెరోటిన్, లుటిన్, ఆంథోసైనిన్ పుష్కలంగా ఉంటాయి. ఈ క్యారెట్లు మన శరీరాన్ని బలోపేతం చేయడానికి సహాయపడతాయి. క్యారెట్లలో లుటిన్, లైకోపీన్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి మన కళ్లను ఆరోగ్యంగా ఉంచడంతో పాటుగా కంటి చూపును కూడా మెరుగుపరచడానికి సహాయపడతాయి. క్యారెట్లలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది కూడా కంటి చూపును పెంచడానికి సహాయపడుతుందని చెబుతున్నారు.

అదేవిధంగా క్యారెట్లలో ఎక్కువ మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలను కూడా నివారిస్తుంది. క్యారెట్లలో ఫాల్కారినాల్ ఉంటుంది. ఫాల్కారినాల్ కొన్ని రకాల క్యాన్సర్ల నుంచి రక్షణ కల్పిస్తుందట. అలాగే క్యారెట్లలో ఉండే ఫైబర్ గుండె ఆరోగ్యానికి కాపాడుతుందట. క్యారెట్ జ్యూస్ ను లివర్ క్యాన్సర్ లేదా లివర్ సిర్రోసిస్ కు విరివిగా ఉపయోగిస్తారు. దీనిలోని పోషకాలు కాలేయ ఎంజైమ్లను మరమ్మత్తు చేయడానికి, పునరుత్పత్తి చేయడానికి సహాయపడతాయి. రోజువారి ఆహారంలో క్యారెట్లను చేర్చడం వల్ల మీ జుట్టు బలోపేతం అవుతుందట. అలాగే మీ చర్మం ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుందని చెబుతున్నారు. క్యారెట్లలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. అందుకే ఇది చర్మంపై ముడతలను నివారించడానికి సహాయపడుతుంది.

దీనిలోని పొటాషియం కంటెంట్ చర్మంలో తేమను కాపాడుతుందట. దీనిలోని విటమిన్ సి శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుందని చెబుతున్నారు. క్యారెట్లలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. పొటాషియం రక్త నాళాలు, ధమనుల ఉద్రిక్తతను తగ్గించడానికి సహాయపడుతుందట. ఇది రక్త ప్రసరణను పెంచి హైబీపీని తగ్గిస్తుందట. అధిక రక్తపోటు రక్త ప్రవాహం, గుండెపోటు, గుండెపోటు వంటి సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుందని చెబుతున్నారు. క్యారెట్లలో విటమిన్ బి 6, విటమిన్ కె, పొటాషియం, భాస్వరం వంటి వివిధ విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది ఎముకల ఆరోగ్యానికి, నాడీ వ్యవస్థను బలోపేతం చేయడానికి, మెదడును ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.