Site icon HashtagU Telugu

Broccoli: సమ్మర్ లో తీసుకోవాల్సిన సూపర్ ఫుడ్ ఇదే.. ఎక్కడైనా కనిపిస్తే అస్సలు వదలకండి!

Broccoli

Broccoli

బ్రోకలీ అనేది ఒక కూరగాయ. ఈ బ్రోకలీ చాలా తక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఇందులో విటమిన్ సి, కె, ఏ వంటివి లభిస్తాయి. ఇది ఎన్నో రకాల ప్రయోజనాలను కలిగిస్తుంది. ఈ బ్రోకలీ ని వేసవికాలంలో క్రమం తప్పకుండా తీసుకోవాలని దీని వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి అని చెబుతున్నారు. మరి ఈ బ్రోకలీ తీసుకుంటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అన్న విషయానికి వస్తే..

కాగా బ్రోకలీలో యాంటీ ఆక్సిడెంట్లు, ముఖ్యంగా సల్ఫోరాఫేన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ ను బ్యాలెన్స్ చేస్తాయట. అలాగే ఈ ఫ్రీ రాడికల్స్ ఆక్సీకరణ ఒత్తిడిని కలిగిస్తాయని, ఇది క్యాన్సర్ గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక వ్యాధులకు దారితీస్తుందని చెబుతున్నారు. అలాగే బ్రోకలీలో ఫైబర్, పొటాషియం ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయట. ఇవన్నీ హృదయ ఆరోగ్యానికి దోహదం చేస్తాయట. ఫైబర్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుందని, పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుందని, ఒమేగా 3లు వాపును కూడా నివారిస్తాయని చెబుతున్నారు. కాగా బ్రోకలీలో ఉండే అధిక స్థాయి విటమిన్ సి తెల్ల రక్త కణాల ఉత్పత్తిని ప్రేరేపించడం ద్వారా రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుందట. ఈ కణాలు ఇన్ఫెక్షన్లు అనారోగ్యాలతో పోరాడటానికి చాలా అవసరం అని చెబుతున్నారు.

కాగా బ్రోకలీలో విటమిన్లు ఎ, సి ఇ పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ ఆరోగ్యకరమైన చర్మానికి చాలా ముఖ్యమైనవని చెబుతున్నారు. కాగా విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుందట. అలాగే ఇది చర్మాన్ని దృఢంగా యవ్వనంగా ఉంచుతుందని చెబుతున్నారు. విటమిన్లు ఎ, ఇ చర్మాన్ని దెబ్బతినకుండా కాపాడి రిపేర్ చేస్తుందట. బ్రోకలీలో ఫైబర్ వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఈ ఆహారం జీర్ణ వ్యవస్థను సులభంగా జీర్ణమయ్యేలా చేస్తుందట. బ్రోకలీ జీర్ణ ఆరోగ్యానికి మద్దతు ఇచ్చే కొన్ని ఎంజైములను కలిగి ఉంటుందని చెబుతున్నారు. అలాగే బ్రోకలీలోని సల్ఫోరాఫేన్ క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తుందట. క్యాన్సర్ కారకాలను నిర్విషీకరణ చేసే ఎంజైమ్‌లను ప్రేరేపిస్తుందట.