Site icon HashtagU Telugu

Black Tea: బ్లాక్ టీ తాగడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఇవే?

Mixcollage 11 Feb 2024 03 38 Pm 7653

Mixcollage 11 Feb 2024 03 38 Pm 7653

నిత్యం మనం కాఫీలు,టీలు తాగుతూ ఉంటాం. ఈ మధ్యకాలంలో గ్రీన్ టీ బ్లాక్ టీ వంటివి కూడా బాగా ఫేమస్ అయ్యాయి. చాలామంది కాఫీ టీలకు బదులుగా గ్రీన్ కి బ్లాక్ టీలను తాగడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. అయితే బ్లాక్ టీ గురించి తెలియని వారు ఆ బ్లాక్ టీ వల్ల ఉపయోగాలు ఏంటి? అవి తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అని ఇక ఆలోచిస్తూ ఉంటారు. అయితే బ్లాక్ టీ వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట. డయాబెటిస్ తో పాటు ఇంకా ఎన్నో రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చట. బ్లాక్ టీ వల్ల కలిగే ప్రయోజనాల విషయానికొస్తే.. ముందుగా ఈ టీ ని ఎలా తయారు చేసుకోవాలి అన్న విషయానికొస్తే..

పాలు చక్కెర లాంటివి కలపకుండా కేవలం పొడి వేసి మరిగించాలి. అలా మరగగా వచ్చిన టీనే బ్లాక్ టీ అంటారు. ఈ బ్లాక్ టీని నిత్యం ఒక కప్పు తాగడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉంటారు. అంతేకాకుండా స్ట్రోక్స్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు. నియంత్రణలో ఉండి రక్తపోటు సమస్య రాకుండా ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. దీని ద్వారా షుగర్ సమస్యలు రాకుండా చేస్తుంది. క్యాన్సర్ ను నిరోధించి కాన్సర్ కణాల అభివృద్ధిని తగ్గించడంలో పస్టిక్ సహాయపడుతుంది. బ్లాక్ తీసుకోవడం వల్ల క్యాన్సర్ నయం కానప్పుడుకి క్యాన్సర్ కణాలతో పోరాటానికి సహాయపడుతుంది.

మన శరీరంలోని వైరస్ బ్యాక్టీరియాలను బయటకు పంపడంలో బ్లాక్ టీ ప్రధాన పాత్ర పోషిస్తుంది. వయసు పెరిగిన కొద్దీ ఎముకల సాంద్రత తగ్గుతుంది. రోజు బ్లాక్ టీ తాగడం వల్ల ఎముకలు బలంగా మారే వీలుంటుంది. సీజనల్ వ్యాధులు అలర్జీలను అరికట్టడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్న బ్లాక్ టీ ని మామూలుగా మాదిరిగానే తయారుచేసుకోవచ్చు. మార్కెట్లో బ్లాక్ టీ బ్యాగ్స్ అందుబాటులో ఉంటాయి. ఆ బ్లాక్ టీ ని ఈ విధంగా కూడా తయారు చేసుకోవచ్చు. నీటిని బాగా మరిగించి అందులో బ్లాక్ టీ బ్యాగ్స్ వేసుకుంటే సరి. కొన్ని నిమిషాల తర్వాత దీనికి అల్లం లేదా నిమ్మకాయ రసాన్ని కలిపి తాగితే ఎంతో మేలు జరుగుతుంది..