మరమరాలు.. వీటిని చాలా ప్రదేశాలలో బొరుగులు అని కూడా పిలుస్తారు. వీటిని వడ్లతో తయారు చేస్తారు అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ మరమరాలతో అనేక రకాల రెసిపీలు తయారు చేసుకుని తింటూ ఉంటారు. ముఖ్యంగా స్ట్రీట్ ఫుడ్ లలో ఎక్కువగా వీటిని ఉపయోగిస్తూ ఉంటారు. కారం బొరుగులు, బొరుగుల మసాలా, బొరుగుల చాట్ మసాలా వంటివి చేసుకొని తింటూ ఉంటారు. అయితే చాలామంది వీటి వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని అనుకుంటూ ఉంటారు. కానీ మీకు తెలియని విషయం ఏమిటంటే ప్రతిరోజు మరమరాలను తినడంతో పాటు మన ఆహారంలో భాగం చేసుకుంటే అనేక ప్రయోజనాలను పొందవచ్చని చెబుతున్నారు.
మరమరాలలో చాలా న్యూట్రియంట్స్ ఉంటాయి. వాటిలో ఫైబర్, ప్రోటీన్, జింక్, ఐరన్, విటమిన్ ఏ, విటమిన్ సీ వంటి మైక్రో న్యూట్రియంట్స్ పుష్కలంగా ఉంటాయి. మరమరాల్లో ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల మలబద్ధకం సమస్య దూరమౌతుంది. అంతేకాదు శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి సహాయపడుతుందని చెబుతున్నారు. ఈ మరమరాలు చాలా లైట్ గా ఉంటాయి. క్యాలరీలు కూడా తక్కువగా ఉంటాయి. వీటితో తయారు చేసిన ఆహారాలు తీసుకోవడం వల్ల బరువు పెరుగుతాము అనే భయం ఉండదట. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆకలి కూడా పెద్దగా వేయదని చెబుతున్నారు.
మరమరాల్లో కాల్షియం, ఐరన్, విటమిన్ డి, రైబో ఫ్లేవిన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. బోన్ సెల్ గ్రోత్ పెరగడానికి, బాడీ డెవలప్మెంట్ కి సహాయపడతాయి. అలాగే మరమరాల్లో సోడియం చాలా తక్కువగా ఉంటుంది. షుగర్ లెవల్స్ కంట్రోల్ చేయడానికి సహాయపడతాయి. అంతేకాదు బీపీని కంట్రోల్ చేయడానికి కీలకంగా పని చేస్తుంది. చాలా రకాల జీర్ణ సమస్యలను పరిష్కరించడానికి మరమరాలు సహాయపడతాయి. రోజూ గుప్పెడు మరమరాలు తిన్నా, దానితో చేసిన పోహా తిన్నా కూడా జీర్ణ సమస్యలు పరిష్కరించడానికి హెల్ప్ అవుతుందని చెబుతున్నారు. అలాగే వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయట. చర్మం సహజంగా మెరిసిపోయేలా చేస్తుందట.
note: ఈ ఆరోగ్య సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే.