వేటవి కాలంలో లభించే వారిలో తాటి ముంజలు కూడా ఒకటి. చాలామంది వీటిని ఇష్టంగా తింటూ ఉంటారు. ఇవి రుచికరంగా ఉండడంతో పాటు ఎన్నో రకాల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలిగిస్తాయి. అందుకే చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు వీటిని ఇష్టంగా తింటూ ఉంటారు. కేవలం తాటి ముంజల వల్ల మాత్రమే కాకుండా తాటి కల్లు వల్ల కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. తాటికల్లులో ఖనిజ లవణాలు, విటమిన్‌లు సమృద్ధిగా ఉంటాయి. ఇవన్నీ శరీరానికి రోగ నిరోధక శక్తిని పెంచేందుకు దోహదం చేస్తాయట.
ఉదయాన్నే పరగడుపున స్వచ్ఛమైన తాటికల్లు తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలని చెబుతున్నారు. ఇకపోతే సమ్మర్ సీజన్ వచ్చిందంటే చాలు తాటి ముంజలు ముత్యపు చిప్పల్లా మెరిసిపోతూ మనకు నోరూరిస్తూ ఉంటాయి. చెప్పాలంటే కల్తీలేనివి, స్వచ్ఛమైన పండు ఏదైనా ఉందా అంటే అది తాటి ముంజలే అని చెప్పాలి. తాటి ముంజలలో విటమిన్ ఎ, విటమిన్ కె వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. వేసవి కాలంలో శరీరం చాలా త్వరగా డీహైడ్రేషన్ కు గురవుతుందట. అలాంటి పరిస్థితుల్లో తాటి ముంజలు శరీరాన్ని హైడ్రేట్ గా మారుస్తాయట. డీహైడ్రేషన్, హీట్ స్ట్రోక్ నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి తాటి ముంజలను తినాలని చెబుతున్నారు.
దీన్ని తినడం వల్ల శరీరం చల్లబడుతుందట. మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుందట. స్థూలకాయంతో బాధపడేవారు తాటిముంజలను తినాలట. ఈ పండులో క్యాలరీ కంటెంట్ చాలా తక్కువగా ఉంటుందట. తాటి ముంజలు తినడం వల్ల ఎక్కువ సేపు ఆకలి వేయదు, ఎందుకంటే అందులో ఎక్కువ నీరు ఉంటుందట. అలాగే పొట్ట సమస్యలు కూడా తాటి ముంజలు ఎంతో బాగా పనిచేస్తాయని చెబుతున్నారు. ఇది జీర్ణ ఎంజైమ్‌లను పెంచడం ద్వారా ఎసిడిటీ సమస్యను దూరం చేయడంలో సహాయపడుతుందట. తాటిముంజలు శరీరంలోని చక్కెర, ఖనిజాల ప్రమాణాలను సమతుల్యం చేస్తాయట. పొటాషియం సమృద్ధిగా ఉంటుందట. దాంతో రక్తపోటు అదుపులో ఉండి గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుందట. లివర్ సంబంధిత సమస్యలను దూరం చేస్తాయని చెబుతున్నారు.