Pregnancy diet: ప్రెగ్నెన్సీ సమయంలో గ్రీన్ ఆపిల్ తినడం వల్ల కలిగే లాభాలు ఇవే?

పెళ్లి అయినా ప్రతి ఒక మహిళకు తల్లి అవడం మనదే దేవుడు ఇచ్చిన గొప్ప వరం. కానీ ఈ రోజుల్లో అదిలో కేవలం ఆరుగురు మాత్రమే తల్లి నలుగురు పిల్లలు కల

  • Written By:
  • Publish Date - September 14, 2023 / 09:30 PM IST

పెళ్లి అయినా ప్రతి ఒక మహిళకు తల్లి అవడం మనదే దేవుడు ఇచ్చిన గొప్ప వరం. కానీ ఈ రోజుల్లో అదిలో కేవలం ఆరుగురు మాత్రమే తల్లి నలుగురు పిల్లలు కలగక హాస్పిటల్స్ చుట్టూ దేవాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అయితే ప్రెగ్నెన్సీ సమయంలో ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకోవాలని అడుగడుగునా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు చెబుతూ ఉంటారు. ఒకటో నెల నుంచి తొమ్మిదవ నెల, ప్రసవం అయ్యేవరకు కూడా మంచి మంచి ఆహారాలతో పాటు చాలా జాగ్రత్తగా తీసుకోమని వైద్యులు కూడా చెబుతుంటారు. అయితే గర్భిణీ స్త్రీలు కొన్ని రకాల ఆహారాలు తీసుకోవాలి కొన్నిరకాల ఆహారాలు తీసుకోకూడదు అని వైద్యులు చెబుతూ ఉంటారు. అటువంటి వాటిలో గ్రీన్ ఆపిల్ కూడా ఒకటి.

మరి ప్రెగ్నెన్సీ సమయంలో గ్రీన్ ఆపిల్ తినవచ్చా తినకూడదా తింటే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం… ప్రెగ్నెన్సీ టైమ్‌లో మలబద్ధఖం, ఇరిటేటబుల్‌ బౌల్‌ సిండ్రోమ్ వంటి జీర్ణ సమస్యలు ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటాయి. గ్రీన్‌ యాపిల్‌లో ఫైబర్‌ అధికంగా ఉంటుంది. ఫైబర్‌ జీర్ణవ్యవస్థను సాఫీగా ఉంచుతుంది. గర్భిణులు.. గ్రీన్‌ యాపిల్‌ తింటే ఆకలి పెరుగుతుంది. ఎసిడిటీ, గ్యాస్ట్రిక్‌, కడుపు ఉబ్బరం వంటి జీర్ణసమస్యలూ దూరం అవుతాయి. గర్భధారణ సమయంలో హైపర్‌టెన్షన్‌ లేదా ప్రీఎక్లంప్సియా తల్లికి, కడుపులోని బిడ్డకు హాని చేస్తాయి. దీనివల్ల గర్భస్థ శిశువుకి, తల్లికి ఇద్దరికీ సమస్యలు రావచ్చు. ఒక్కోసారి అవి ప్రాణాంతకం కూడా కావచ్చు. గర్భిణులు బీపీని కంట్రోల్‌లో ఉంచుకోవడానికి తగినంత విటమిన్‌ సి తీసుకోవాలి.

గ్రీన్‌ యాపిల్స్‌లో విటమిన్‌ సి మెండుగా ఉంటుంది. ఇది డైట్‌లో చేర్చుకుంటే హైపర్‌టెన్షన్‌ కంట్రోల్‌లో ఉంటుంది. గ్రీన్ యాపిల్స్‌లో విటమిన్ ఎ, సి, బి6 పుష్కలంగా ఉంటాయి. ఈ పండులో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం వంటి మినరల్స్‌ మెండుగా ఉంటాయి. ఈ పోషకాలు తల్లీ, బిడ్డ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. గర్భధారణ సమయంలో గ్రీన్ యాపిల్ తీసుకోవడం వల్ల శరీర నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు. చాలామంది మహిళలు గర్భధారణ సమయంలో చర్మ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ డైట్‌ గ్రీన్‌ యాపిల్‌ చేర్చుకోవాలి. గ్రీన్‌ యాపిల్‌లో విటమిన్‌ ఏ, బి, సి మెండుగా ఉంటాయి. ఈ పోషకాలు చర్మాన్ని ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా ఉంచుతాయి. గ్రీన్‌ యాపిల్‌ లివర్‌ను డిటాక్స్‌ చేస్తుంది.