మామూలుగా ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని అంటూ ఉంటారు. ఉల్లిపాయ ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది. మరి ముఖ్యంగా జుట్టుకు సంబంధించిన సమస్యలను తగ్గించడంలో ఉల్లిపాయ ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. ఆరోగ్యానికి కూడా ఉల్లిపాయ ఎంతో మేలు చేస్తుంది. ఉల్లిపాయ లేకుండా దాదాపుగా చాలా రకాల వంటలు పూర్తికావు. కొందరు కూరల్లో వేసిన ఉల్లిపాయలు మాత్రమే కాకుండా పచ్చిగా కూడా తింటూ ఉంటారు. ఉల్లిపాయ వల్ల కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. అలాగే ఉల్లిపాయ మధుమేహులకు ఎంతో మేలు చేస్తుంది.
దీనిలో పీచు, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి మధుమేహాన్ని నియంత్రిస్తాయి. డయాబెటీస్ పేషెంట్లు ఉల్లిపాయను రోజూ తింటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. ఉల్లిపాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు, సల్ఫర్ లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి ఎంతగానో సహాయపడతాయి. అంతేకాకుండా ఉల్లి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఉల్లిపాయల్లో సల్ఫర్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది మన ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి బాగా సహాయపడుతుంది. రోజూ ఉల్లిపాయలను తింటే ఎముకలు కూడా బలంగా ఉంటాయని చెబుతున్నారు. ఉల్లిపాయల్లో విటమిన్ సి తో పాటుగా ఇతర యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి.
అందుకే రోజూ ఉల్లిపాయలను మన రోజువారి ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల మన ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది. అలాగే విటమిన్ సి ఎక్కువగా ఉండే ఉల్లిపాయలను రోజూ తినడం వల్ల ఊపిరితిత్తుల ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఇది ఊపిరితిత్తుల పనితీరును కూడా మెరుగుపరుస్తుందని చెబుతున్నారు. ఉల్లిపాయల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడానికి, మలబద్దకాన్ని తగ్గించడానికి ఎంతో బాగా సహాయపడుతుంది. జీర్ణ సమస్యలతో బాధపడేవారికి ఉల్లిగడ్డ మేలు చేస్తుందని చెబుతున్నారు. ఉల్లిపాయలలో ఉండే సల్ఫర్, ఇతర యాంటీఆక్సిడెంట్లు కూడా కొన్ని క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. అందుకే రోజూ ఉల్లిపాయలను మోతాదులోనే తింటే క్యాన్సర్ల ముప్పు కూడా తప్పుతుందట. ఉల్లిపాయలలో కేలరీలు తక్కువగా, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇందులోని ఫైబర్ ఆకలిని తగ్గిసంచి, మిమ్మల్ని ఎక్కువగా తినకుండా చేస్తుంది. దీంతో మీరు సులువుగా బరువు తగ్గుతారు. కాబట్టి ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఉల్లిపాయను ప్రతిరోజు తినడం ఆరోగ్యానికి మంచిదే అని చెబుతున్నారు.
note : ఈ ఆరోగ్య సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించబడినది. ఇందులో ఎటువంటి సందేహాలు ఉన్న వైద్యులు సలహా తీసుకోవడం మంచిది.