Site icon HashtagU Telugu

Onion: ఉల్లిపాయను ప్రతిరోజు తీసుకుంటే శరీరంలో ఎలాంటి మార్పులు కలుగుతాయో మీకు తెలుసా?

Onion

Onion

మామూలుగా ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అనే సామెతను మనం వినే ఉంటాం. దీని అర్థం ఉల్లిపాయ వల్ల అన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయని అర్ధం. ఉల్లిపాయ కూరలకు రుచిని పెంచడంతోపాటు ఎన్నో రకాల ప్రయోజనాలను కూడా కలిగిస్తుంది. అందుకే దీనిని పచ్చిగా కూడా తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. కాగా ఉల్లిపాయ మదిమేహం ఉన్నవారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో ఉండే పీచు యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి మధుమేహాన్ని నియంత్రిస్తాయట.

ఈరోజు డయాబెటిస్ పేషెంట్లు ఉల్లిపాయను తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయని చెబుతున్నారు. ఉల్లిపాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు, సల్ఫర్ లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి ఎంతగానో సహాయపడతాయట. అంతేకాకుండా ఇది మన గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతున్నారు. ఉల్లిపాయల్లో సల్ఫర్ ఎక్కువ మొత్తంలో ఉంటుందట. ఇది మన ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి బాగా సహాయపడుతుందట. రోజూ ఉల్లిపాయలను తింటే ఎముకలు బలంగా ఉంటాయనీ చెబుతున్నారు. కాగా ఉల్లిపాయల్లో విటమిన్ సి తో పాటుగా ఇతర యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయట.

అందుకే రోజూ ఉల్లిపాయలను మన రోజువారి ఆహారంలో భాగం చేసుకుంటే మన ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుందని చెబుతున్నారు. విటమిన్ సి ఎక్కువగా ఉండే ఉల్లిపాయలను రోజూ తినడం వల్ల ఊపిరితిత్తుల ఆరోగ్యం బాగుంటుందట. ఇది ఊపిరితిత్తుల పనితీరును కూడా మెరుగుపరుస్తుందట. కాగా విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న ఉల్లిపాయలు మన చర్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయట. ఇది చర్మంపై ముడతలు, నల్ల మచ్చలు రాకుండా చేయడానికి సహాయపడుతుంది. అలాగే చర్మం కాంతివంతంగా మెరవడానికి కూడా సహాయపడుతుందని చెబుతున్నారు.