జామపండు వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. జామ పండులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. అలాగే ఎన్నో రకాల పోషకాలు కూడా జామలో ఉన్నాయి. అందుకే జామకాయను పేదవాడి యాపిల్ అని పిలుస్తారు. జామ పండు ఎన్నో రకాల వ్యాధులకు గొప్ప ఔషధంలా పనిచేస్తుంది. జామ పండు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి కలిగిస్తుంది. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. జామలో ఫైబర్ కూడా లభిస్తుంది. ఇది జీర్ణక్రియను ఆరోగ్యంగా చేసేందుకు, మలబద్దకాన్ని నివారించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది.
అయితే ఇలాంటి జామ పండును పరగడుపున తీసుకోవడం వల్ల ఏం జరుగుతుందో ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. జామలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది మన రోగ నిరోధక శక్తిని బలోపేతం చేసి జలుబు, ఫ్లూ వంటి వ్యాధుల నుంచి రక్షిస్తుంది. జామలో ఉండే ఇతర యాంటీ ఆక్సిడెంట్లు కూడా మన శరీరాన్ని వివిధ రకాల వ్యాధుల నుంచి రక్షిస్తుంది. జామలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి రోజు ఉదయాన్నే జామ పండు తినడం వల్ల మలబద్ధకం సమస్యల నంచి విముక్తి కలిగిస్తుంది. అలాగే జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. జామలో ఉండే ఇతర పోషకాలు కూడా జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడతాయి.
అలాగే జామలో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది. అదే విధంగా ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. జామలో ఉండే మోనోఅన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్ కూడా గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయని వైద్యులు చెబుతున్నారు. ఉదయాన్నే జామపండు తినడం వల్ల విటమిన్లు , ఫైబర్ మోతాదుతో మీ రోజును ప్రారంభించడానికి గొప్ప మార్గం. జామలోని సహజ చక్కెరలు శీఘ్ర శక్తిని అందించగలవు. అలాగే ఫైబర్ ఆరోగ్యకరమైన జీర్ణక్రియను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. జామలో ఉండే ఫైబర్ చక్కెర శోషణను నెమ్మదించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. దీంతో పాటు మధుమేహం ఉన్నవారికి జామ చాలా బాగా పని చేస్తుంది. జామలో ఉండే క్రోమియం కూడా చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడుతుందని చెబుతున్నారు.