Site icon HashtagU Telugu

Goat Milk: మేకపాలు ఎప్పుడూ తాగలేదా.. ఈ విషయం తెలిస్తే వెంటనే తాగడం మొదలు పెడతారు?

Goat Milk

Goat Milk

మామూలుగా మనం తరచూ పాలను ఉపయోగిస్తూనే ఉంటాం. ఉదయం లేచిన దగ్గర్నుంచి సాయంత్రం పడుకునే వరకు పాలను కాఫీ లేదా టీ రూపంలో తీసుకుంటూ ఉంటాం. ఇంకొందరు పాలు మాత్రమే తాగుతూ ఉంటారు.. కొంతమంది ఆవు పాలు తాగితే మరికొందరు గేదె పాలు తాగుతూ ఉంటారు.. ఎక్కువగా ఈ రెండు పాలను మాత్రమే ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఎప్పుడైనా మేక పాలు తాగారా. ఆవు పాలకు బదులుగా గేదె పాలకు బదులుగా మేకపాలు తాగితే ఎన్నో రకాల ప్రయోజనాలను పొందవచ్చు అని చెబుతున్నారు. వీటిని తాగడం వల్ల అనేక లాభాలు ఉన్నాయట. మరి మేకపాలతో ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అన్న విషయానికి వస్తే.. మేక పాలలో కాల్షియం, విటమిన్ ఎ, బి6లు ఉంటాయి.

వీటిని తాగడం వల్ల గుండె, ఎముకల ఆరోగ్యం బాగుంటుందట. వీటిని తీసుకోవడం వల్ల వాపు తగ్గుతుందట. ఆందోళన కూడా తగ్గుతుందని,రక్తహీనత సమస్యలు దూరమవుతాయని చెబుతున్నారు. మేకపాలలో ఎక్కువగా ఐరన్ ఉంటుంది. ఈ పాలని తీసుకోవడం వల్ల బాడీలో ఇన్‌ఫ్లమేషన్ కూడా తగ్గుతుందట. కాగా మేకపాలలో ఒక అద్భుతమైన జీవక్రియ ఏజెంట్ ఉంటుంది. ఇది కాల్షియం, ఇనుము వంటి ఖనిజాల జీవక్రియకి హెల్ప్ అవుతుందట. ఈ పాలలో ఎ2 బీటా కేసిన్ ఉంటుంది. ఇది ఆవు పాలలో ఉండే ఎ1 బీటా కేసిన్ కంటే చాలా హెల్దీ. అయితే ఇందులోని ఎ1 ప్రతి రూపం షుగర్, ఇస్కీమిక్ గుండె సమస్యలకి ప్రమాదమట. కాగా మేకపాలు తీసుకోవడం వల్ల ఎముకల ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నవారిలో ఎముకల సమస్యల్ని తగ్గించడంలో హెల్ప్ చేస్తుందట.

మేక పాలలోని ఒక ప్రోటీన్ తొడ ఎముకలు పెరగడానికి హెల్ప్ అయితే, మేక పాలతో తయారైన పెరుగు కంటే పాలు బలం అని తెలుస్తోంది. మేకపాలు తాగించిన జంతువుల్లో ఎముకల్లో ఎముకలకి సంబంధించిన సమస్యలు దూరమైనట్లు తేలింది. మేకపాలలో ఎక్కువగా మెగ్నీషియం ఉంటుంది. ఈ న్యూట్రిషియన్ గుండె ఆరోగ్యానికి చాలా మంచిదట. దీని వల్ల గుండె సాధారణ స్పందన మెంటెయిన్ అవుతుందట. దీంతో రక్తం గడ్డకట్టడం, కొలెస్ట్రాల్ తగ్గడం వంటి సమస్యలు కూడా దూరమవుతాయట. ఆవుపాల కంటే గేదె పాల కంటే మేకపాలలోనే ఎక్కువగా మెగ్నీషియం ఉంటుందని చెబుతున్నారు. మేక పాలు తొందరగా దీర్ణమవుతాయట. ఆవు పాల కంటే మేకపాలు త్వరగా జీర్ణమైనప్పటికీ రెండింటిలోనూ ఒకే మొత్తంలో లాక్టోస్ ఉంటుంది. మేకపాలలో తక్కువ లాక్టోస్ ఉందనుకుంటారు. కానీ, ఇది నిజం కాదు. మేకపాలలో ఎక్కువగా పొటాషియం ఉంటుంది. దీని వల్ల హైబీపి వంటి సమస్యలు తగ్గుతాయి. రెగ్యులర్‌గా తాగితే బీపి ఉన్నవారికి మంచిదని చెబుతున్నారు.