Site icon HashtagU Telugu

Alzheimer’s : మతిమరుపు ఎందుకు వస్తుంది? దానిని నివారించడానికి ఏం చేయాలి?

Alzheimers

Alzheimers

మతిమరుపు(Memory Loss) అనేది సామాన్యంగా అరవై ఏళ్ళు పైబడిన వారికి వస్తుంది. అయితే ఈ కాలంలో 30 – 40 ఏళ్ళ మధ్యలో ఉన్నవారికి కూడా మతిమరుపు(Alzheimer’s) అనేది వస్తుంది. కొన్ని జన్యుపరమైన కారణాలు కూడా అల్జీమర్స్ ప్రమాదాన్ని పెంచుతాయి. మతిమరుపు అనేది మన మెదడుకు(Brain) దెబ్బ తగలడం, స్ట్రోక్ వంటివి ఏర్పడినప్పుడు వస్తాయి. రక్తపోటు అధికంగా ఉండడం, టైపు 2 మధుమేహం ఉండడం వలన కూడా మతిమరుపు అనేది రావడానికి కారణం కావచ్చు. వాయు కాలుష్యం, పురుగుమందుల వాడకం వంటి వాటి వలన కూడా మతిమరుపు అనేది వస్తుంది. చిన్న వయసులోనే మతిమరుపు రావడానికి సరైన జీవనశైలి లేకపోవడం, బద్దకానికి అలవాటు పడడం వలన, చెడు వ్యసనాలకు అలవాటు పడడం వంటివి కారణం అవుతాయి.

అయితే మతిమరుపును తగ్గించుకోవడానికి పజిల్స్ ఫిల్ చేయడం, కొత్త భాష నేర్చుకోవడం, చదవడం, రాయడం వంటివి చేయడం, ప్రతి రోజూ 30 నిముషాల పాటు వ్యాయామం, యోగా వంటివి చేయాలి, చెస్, క్యారంస్ లాంటి ధ్యాస ఎక్కువ పెట్టె గేమ్స్ ఆడుతూ ఉండాలి. అప్పుడు మతిమరుపు అనేది కొంతవరకు తగ్గుతుంది.

ధూమపానం, మద్యపానం వంటివి చేయకూడదు. కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు వంటి వాటిని ఆహారపదార్థాల డైట్ లో చేర్చుకోవాలి. ఇవి తినడం వలన మతిమరుపు అనేది తగ్గుతుంది. మన శరీరంలో రక్తపోటు, కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉండేలా చూసుకోవాలి ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి అప్పుడే మతిమరుపు తగ్గుతుంది. మంచి నిద్ర కూడా మతిమరుపును తగ్గిస్తుంది. సామాజికంగా చురుకుగా ఉండడం వలన, ప్రకృతికి దగ్గరగా ఉండటం వలన కూడా మతిమరుపు అనేది తగ్గుతుంది.

 

Also Read : Foods for Upset Stomach: జీర్ణక్రియ సమస్యలతో చెక్ పెట్టండిలా..!