ఈ రోజుల్లో చాలామంది మగవారిని వేధిస్తున్న సమస్య బాణ లాంటి పొట్ట. ఈ బాణ లాంటి పొట్ట కారణంగా చాలామంది అనేక ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. కొందరు ఎక్కువగా భోజనం చేయడం వల్ల ఈ బాణ లాంటి పొట్ట వస్తే మరి కొందరికి గ్యాస్ ప్రాబ్లం వల్ల కూడా ఈ పొట్ట వస్తూ ఉంటుంది. అయితే పొట్ట ఒక్కసారి వచ్చింది అంటే తగ్గడం చాలా కష్టం. ఈ బాణలాంటి ఇప్పటిను తగ్గించుకోవడం కోసం చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే ఇందుకోసం కలబంద ఎంతో బాగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. మరి బాణ లాంటి పొట్టను కలబందతో ఏ విధంగా తగ్గించుకోవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
కలబందలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. శరీర బరువుని తగ్గించడంలో ఇది చాలా సహాయపడుతుంది. అయితే కలబంద జ్యూస్ లో నిమ్మరసం, తేనె కలిపి ఆ మిశ్రమాన్ని తాగితే అది భారీ పొట్టకి దివ్య ఔషధంలా పనిచేస్తుందట. కలబందలో ఉండే విటమిన్లు ఖనిజాలతో పాటు బరువుని తగ్గించే కొన్ని క్రియాశీల సమ్మేళనాలు కూడా ఇందులో ఉంటాయి. ఇది శరీరంలోని రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు శరీరంలో ఉండే అదనపు కొవ్వుని కరిగించడానికి సహాయపడుతుందట. కాబట్టి తక్కువ మొత్తంలో తీసుకోవటం వలన జీర్ణ క్రియకు సహాయపడుతుందట. అలాగే భారీపొట్ట తగ్గడానికి కూడా బాగా పనిచేస్తుందని చెబుతున్నారు.అయితే అలోవెరా జెల్ రెండు టేబుల్ స్పూన్లు, నిమ్మరసం ఒక టీ స్పూన్ తేనె, ఒక టేబుల్ స్పూన్, పుదీనా ఆరు ఆకులు తీసుకోవాలి.
అయితే ఇందులో తేనె తప్ప మిగతావన్నీ వేసి అందులో ఒక గ్లాస్ నీళ్లు పోసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత అందులో తేనె కలిపి తీసుకుంటే కలబంద రసం రెడీ అవుతుంది. దీనిని నిద్రలేచిన వెంటనే ఖాళీ కడుపుతో తాగటం వలన మంచి ఫలితాలు కనిపిస్తాయట. అలాగే అలోవెరా జ్యూస్ ని ఎక్కువగా తాగితే సైడ్ ఎఫెక్ట్స్ ని ఫేస్ చేయవలసి ఉంటుందట. ఈ జ్యూస్ లో ఉండే నిమ్మకాయ శరీరానికి డిహైడ్రేషన్ తగ్గించి జీవక్రియని పెంచుతుందట. అలాగే తేనె కొవ్వుని కరిగించి హార్మోన్లు విడుదల చేసేలాగా చేస్తుందని చెబుతున్నారు. బాణ లాంటి పొట్ట అలాగే పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయి ఇబ్బంది పడుతున్నవారు ఈ కలబంద జ్యూస్ ని తాగడం వల్ల తొందరగా పొట్టను తగ్గించుకోవచ్చు అని చెబుతున్నారు.