డ్రై ఫ్రూట్స్ లో ఒకటైన బాదంపప్పు గురించి మనందరికీ తెలిసిందే. బాదంపప్పు వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. వీటిలో ఎక్కువ మొత్తంలో విటమిన్లు ఖనిజాలు ఫైబర్ లభిస్తాయి. వీటిని తరచుగా తీసుకోవడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ ఈ బాదంపప్పుని ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే చాలామందికి బాధ పప్పును తినేటప్పుడు తొక్కతో పాటు తినాలా, లేకుంటే తొక్క లేకుండా తినాలా అన్న సందేహం కలుగుతూ ఉంటుంది. మరి ఈ విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ముందుగా బాదంను తొక్కతో పాటు తినడం వల్ల కలిగే లాభాల విషయానికి వస్తే.. చాలామంది బాదం పై తొక్కను తీసివేసి విత్తన భాగాన్ని మాత్రమే తింటారు.
కానీ బాదం పై తొక్క కూడా అనేక పోషకాలతో నిండి ఉంటుంది. బాదం పై తొక్కలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు కూడా అధికంగా ఉంటాయి. అలాగే బాదం పై తొక్కలో ఉండే పోషకాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అదేవిధంగా రక్తపోటును కూడా నియంత్రిస్తాయి. చెడు కొలెస్ట్రాల్ ను కూడా తగ్గిస్తాయి. అలాగే బాదం పై తొక్కలో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. మలబద్ధకం సమస్యను కూడా తగ్గిస్తుంది. బాదం పై తొక్కలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని స్వేచ్ఛా రాశుల నుంచి రక్షిస్తాయి. ముడతలు, చర్మం వృద్ధాప్యం వంటి సమస్యలను నిరోధిస్తాయి.
ఇక తొక్క లేకుండా బాదం తినడం వల్ల కలిగే ప్రయోజనాల విషయానికి వస్తే.. బాదం పప్పు పై తొక్కలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. మలబద్ధకం నివారిస్తుంది, బరువు నియంత్రణకు సహాయపడుతుంది. అలాగే బాదం పప్పు పై తొక్కలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని కణాలను నష్టం నుంచి రక్షిస్తాయి, వ్యాధులను నిరోధిస్తాయి. అలాగే ఇందులో విటమిన్ ఈ పుష్కలంగా లభిస్తుంది. ఇది జుట్టు అలాగే చర్మం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బాదం పప్పు పై తొక్కలో మెగ్నీషియం, కాపర్, జింక్ వంటి ముఖ్యమైన ఖనిజాలు ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యానికి, నరాల ఆరోగ్యానికి శరీరంలోని వివిధ రకాల ప్రక్రియలకు సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే బాదం పప్పు పై తొక్క కొంతమందికి జీర్ణం కావడం కష్టంగా ఉండవచ్చు. ఇది అజీర్తి, గ్యాస్, అతిసారం వంటి సమస్యలకు దారితీయవచ్చని చెబుతున్నారు. పై తొక్కతో బాదం తినడం అనేది అధిక ప్రయోజనాలను కలిగిస్తుంది. అయితే, జీర్ణ సమస్యలు ఉంటే లేదా పై తొక్క రుచి నచ్చకపోతే, పై తొక్క లేకుండా బాదం తినవచ్చు.
note : ఈ ఆరోగ్య సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించబడినది. ఇందులో ఎటువంటి సందేహాలు ఉన్న వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.