Almond Tea : ప్రతిరోజూ ఉదయం లేచిన వెంటనే చాలామంది టీ, కాఫీ తాగడం అలవాటుగా మార్చుకున్నారు. తల నొప్పి, అలసట నుంచి ఉపశమనం లభించడం, దినచర్య ప్రారంభానికి ఉత్సాహంగా ఉండేందుకు వీటిని ఉపయోగిస్తుంటారు. కానీ వీటిని అధికంగా తాగడం ఆరోగ్యాన్ని హానిచేయవచ్చు. క్యాఫైన్ అధికంగా ఉండటం వల్ల హృదయ సంబంధిత సమస్యలు, అసిడిటీ, నిద్రలేమి వంటి అనారోగ్యాలు కలగవచ్చు. అందుకే తాజాగా ఆరోగ్యవంతమైన ప్రత్యామ్నాయంగా వెలుగులోకి వస్తున్నది బాదం టీ.
బాదం టీ అంటే ఏమిటి?
బాదం టీ అనేది బాదం పొడి లేదా బాదం పాలను ఉపయోగించి తయారుచేసే ఆరోగ్య పానీయం. ఇది సహజంగా స్వీట్‌గా ఉండి రుచికరంగా ఉండే ఈ టీ, శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. కాఫీ, రెగ్యులర్ టీ లాంటి క్యాఫైన్ పానీయాల స్థానంలో దీనిని తీసుకుంటే శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి.
ఆరోగ్య ప్రయోజనాలు
1. శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్:
బాదంపప్పులో విటమిన్-ఇ అధికంగా ఉంటుంది. ఇది శరీరాన్ని ఆక్సీకరణ ఒత్తిడిలోంచి రక్షిస్తుంది. కణ నాశనాన్ని తగ్గించి, వృద్ధాప్యాన్ని దూరంగా ఉంచుతుంది. దీని వల్ల చర్మం మెరిసేలా మారుతుంది, ముడతలు తగ్గుతాయి.
2. హృదయ ఆరోగ్యానికి మేలు:
బాదం టీలో ఉండే మోనో మరియు పాలీ అన్‌శాచురేటెడ్ కొవ్వులు హృదయ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇవి రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం నివారించడంతో గుండె పోటు ప్రమాదం తగ్గుతుంది.
3. మెదడు చురుకుగా పనిచేస్తుంది:
బాదంపప్పులో ఉన్న మెగ్నిషియం నాడీ మండల వ్యవస్థకు సహాయపడుతుంది. ఇది మెదడుకు ఆక్సిజన్ సరఫరా మెరుగుపరచి, మనసు స్పష్టత, ఏకాగ్రత పెంపుకు దోహదం చేస్తుంది.
4. షుగర్ లెవల్స్ నియంత్రణ:
బాదం టీని చక్కెర లేకుండా తీసుకుంటే డయాబెటిస్ ఉన్నవారికి ఎంతో మేలు చేస్తుంది. ఇది రక్తంలోని గ్లూకోజ్ స్థాయిని సమతుల్యంగా ఉంచుతుంది.
5. జీర్ణక్రియకు తోడ్పాటు:
బాదం టీలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచి, భోజనం సులభంగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. అసిడిటీ, గ్యాస్, అజీర్తి వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
6. ఎముకలకు బలం:
బాదం టీలో ఉన్న క్యాల్షియం, విటమిన్-D వంటి పోషకాలు ఎముకలను దృఢంగా చేస్తాయి. ముఖ్యంగా వయస్సుతో పాటు కలిగే ఎముకల బలహీనత సమస్యను దూరం చేస్తాయి.
7. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది:
విటమిన్ E తో పాటు బి-విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు శరీర రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. దీని వల్ల జలుబు, దగ్గు, జ్వరం వంటి సీజనల్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది.
ఇంట్లోనే తయారీ సులభం
బాదం టీని ఇంట్లో సులభంగా తయారుచేయవచ్చు. 4-5 బాదంపప్పులను రాత్రికి నానబెట్టి, పొడి చేసి పాలను మరిగించే వేళ కలిపి టీగా తయారు చేసుకోవచ్చు. కావాలంటే లవంగం, యాలకుల వంటి సుగంధ ద్రవ్యాలు కలిపి రుచి, ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు. కాగా, రోజూ ఉదయం కాఫీ, టీ తాగడం బదులు బాదం టీ తీసుకుంటే శరీరానికి ఎన్నో లాభాలు కలుగుతాయి. ఇది రుచిగా ఉండటమే కాకుండా, ఆరోగ్యానికి దోహదం చేసే సమృద్ధమైన పోషకాల వనరుగా నిలుస్తుంది. ఇక మీరు కూడా ఈరోజు నుంచే బాదం టీ అలవాటు వేసుకోండి… ఆరోగ్యాన్ని ఆకర్షించండి.