Site icon HashtagU Telugu

Almond: పరగడుపున బాదం పప్పులు తింటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో మీకు తెలుసా?

Almond

Almond

బాదం పప్పుల వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం అందరికీ తెలిసిందే.. బాదంను ఎన్నో రకాల స్వీట్ల తయారీలో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. వీటిని నేరుగా కూడా తింటూ ఉంటారు. బాదం వల్ల అనేక లాభాలు కూడా ఉన్నాయి. కొందరు వీటిని పొట్టు తీసి తింటే మరికొందరు అలాగే నేరుగా తినేస్తూ ఉంటారు. రాత్రిళ్ళు నానబెట్టి ఉదయాన్నే తింటూ ఉంటారు. ఇకపోతే కొందరు వీటిని పరగడుపున తింటూ ఉంటారు. మరి ఉదయాన్నే పరగడుపున వీటిని తింటే ఏం జరుగుతుందో, ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. బాదం పప్పులను ఉదయం పరిగడుపున తినడం వల్ల చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయట.

బాదంలో అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయని, వీటిని రాత్రంతా నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే పరగడుపున తింటే మీరు ఎన్నో వ్యాధులకు దూరంగా ఉండవచ్చు అని చెబుతున్నారు. బాదం పప్పుల్లో యాంటీ ఆక్సిడెంట్స్ మెండుగా ఉంటాయట. అవి మమన శరీరంలోని కణాలను ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి రక్షించడానికి సహాయపడతాయట. వీటిని పరగడుపున తిన్నప్పుడు ఈ యాంటీ ఆక్సిడెంట్లు మీ శరీరంలోని హానికరమైన పదార్థాలను తటస్తం చేస్తాయట. అలాగే మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేసి, మిమ్మల్ని దీర్ఘకాలిక వ్యాధుల నుంచి రక్షించడానికి సహాయపడతాయని చెబుతున్నారు.

కాగా బాదం పప్పుల్లో కొవ్వు ఎక్కువగా ఉన్నప్పటికీ వీటిలో ఆరోగ్యకరమైన మోనోశాచురేటెడ్ కొవ్వులు ఉంటాయని, ఇవి శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి ఉపయోగపడతాయని చెబుతున్నారు. పరగడుపున బాదం పప్పులను తింటే ఈ ఆరోగ్యకరమైన కొవ్వులు మంచి మొత్తంలో లభిస్తాయట. ఇవి మీ కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచడానికి సహాయపడతాయని చెబుతున్నారు. విటమిన్ ఇ పుష్కలంగా ఉండే ఆహారాల్లో బాదం పప్పు కూడా ఒకటి. ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్. ఇది మీ చర్మాన్ని, జుట్టును, గోర్లను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుందట. ఖాళీ కడుపుతో బాదం పప్పులను తినడం వల్ల మీ స్కిన్ టోన్ మెరుగుపడుతుందని, చర్మం సహజంగా మెరుస్తుందని చెబుతున్నారు. ఉదయాన్నే మీకు వెంటనే ఎనర్జీ కావాలంటే పరగడుపున గుప్పెడు బాదం పప్పులను తినాలి. ఇవి మీకు రోజంతా స్థిరమైన ఎనర్జీని అందిస్తాయట. బాదం పప్పుల్లోని ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ కలయిక మీకు మంచి శక్తిని అందిస్తాయట. ఇవి ఆహార కోరికలను తగ్గించడానికి కూడా సహాయపడతాయని చెబుతున్నారు.

Exit mobile version