చలికాలంలో మనకు సూర్యరశ్మి చాలా తక్కువగా ఉంటుంది. ఎక్కువ శాతం వాతావరణం చల్లగా ఉంటుంది. వర్షం పడేలా మబ్బులు కమ్ముకొని ఉంటుంది. అందుకే చలికాలంలో చాలామంది ఉదయం సమయంలో బయటికి రావాలి అంటే స్వెటర్ లేకుండా బయటకు రావడానికి అసలు ఇష్టపడరు. అంతేకాకుండా చలికాలంలో సూర్యరశ్మి ఎంతసేపటికి రాదు. చాలామంది సూర్యరష్మి కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. అయితే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే 10 నిమిషాల్లో చలికాలంలో ఎండలో నిలబడడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అంటున్నారు వైద్యులు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
చలికాలంలో ఎండలో కూర్చోవడం వల్ల శరీరానికి కావలసిన డీ విటమిన్ అందడంతో పాటు శరీరం వెచ్చగా ఉంటుంది. శీతాకాలంలో సూర్యరశ్మి చాలా అవసరం. చలి కారణంగా చాలా మంది స్వెటర్ వేసుకోకుండా బయటకు రారు. అలాగే సూర్యరశ్మి కోసం వేచి ఉండకపోవడం వల్ల విటమిన్ డి లోపం ఏర్పడుతుంది. అయితే రోజుకు పది నిమిషాలు కూడా ఎండలో కూర్చోవడం వల్ల డిప్రెషన్ తగ్గుతుంది. శరీరంలో విటమిన్ డి లోపిస్తే సూర్యరశ్మిలో నించోవడం మంచిది. ఎందుకంటే సూర్యరశ్మి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది విటమిన్ డి లోపాన్ని నివారిస్తుంది. అలాగే మీరు ఎండలో కూర్చుని సూర్యుని కోసం వేచి ఉండటం వల్ల మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు.
ఇది శరీరం నుండి అలసటను కూడా తొలగిస్తుంది. అందుకే ప్రతిరోజు కాసేపు ఎండలో నిలబడాలి. మీరు నిద్ర సరిగా పట్టక ఇబ్బంది పడుతుంటే, మీరు సూర్యరశ్మిలో కాసేపు ఉండాలి. అప్పుడు మీకు మంచి నిద్ర వస్తుంది. అలాగే రోగనిరోధక శక్తిని పెంచడంలో సూర్యరశ్మి చాలా మేలు చేస్తుంది. కాబట్టి మీరు ప్రతిరోజూ సూర్యరశ్మి కోసం వేచి ఉండాలి. ఇది శరీర నొప్పులను కూడా తగ్గిస్తుంది. అలాగే ఇది క్యాన్సర్ నుండి మిమ్మల్ని రక్షించడానికి , అనేక ఇతర వ్యాధుల నుండి ఉపశమనం పొందడానికి సహాయపడుతుంది. కాబట్టి చలికాలంలో 10 నిమిషాల పాటు ఎండలో ఉండడం చాలా మంచిది.