Black Beans Nutrition : హెల్త్ క్వీన్.. బ్లాక్ బీన్ విశేషాలు

Black Beans Nutrition : చికెన్, చేపల్లో ఉండే ప్రొటీన్.. తక్కువ రేటుకే ఇచ్చే గింజ అది. బాడీలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి.. గుండె ఆరోగ్యాన్ని బెటర్ చేసే గింజ అది. బరువు తగ్గాలని ట్రై చేసే వాళ్లకు డైటరీ ఫైబర్ ను అందించి ఆకలిని కంట్రోల్ చేసే గింజ అది.

  • Written By:
  • Updated On - May 31, 2023 / 09:37 AM IST

Black Beans Nutrition : చికెన్, చేపల్లో ఉండే ప్రొటీన్.. తక్కువ రేటుకే ఇచ్చే గింజ అది.

బాడీలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి.. గుండె ఆరోగ్యాన్ని బెటర్ చేసే గింజ అది. 

బరువు తగ్గాలని ట్రై చేసే వాళ్లకు డైటరీ ఫైబర్ ను అందించి ఆకలిని కంట్రోల్ చేసే గింజ అది.

ఈ విశేషాలన్నీ 7,000 సంవత్సరాల చరిత్ర కలిగిన  బ్లాక్ బీన్స్(Black Beans Nutrition )గింజలది. వీటిని నల్ల తాబేలు బీన్ (బ్లాక్ టర్టిల్ బీన్) అని కూడా పిలుస్తారు. అమెరికాలో తొలుత వెలుగులోకి వచ్చిన బ్లాక్ బీన్  ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వినియోగంలో ఉంది. దక్షిణ అమెరికాలో దీన్ని ఎక్కువగా వినియోగిస్తారు. మన ఇండియాలో ప్రత్యేకించి తమిళ వంటకాలలో బ్లాక్ బీన్  ఎక్కువగా ఉపయోగిస్తారు. తమిళనాడులో బ్లాక్ బీన్ ను కరుప్పు కారమణిగా, మహారాష్ట్రలో కాలా ఘెవాడాగా, ఉత్తరాఖండ్ లో భట్ అని పిలుస్తారు. బ్లాక్ బీన్స్ ను కొంద‌రు ఉడికించి తీసుకుంటే.. మ‌రికొంద‌రు కూర‌లు, సూప్స్ త‌యారు చేసి తీసుకుంటారు. వీటిని ఎలా తీసుకున్నా టేస్ట్ గా ఉంటాయి.

Also read  : Kidney Beans and Diabetes: కిడ్నీ బీన్స్ గురించి మీకు ఈ విషయాలు తెలుసా? ఇవి తింటే మధుమేహం నుంచి ఆ వ్యాధులు అన్నీ నయం!

బ్లాక్ బీన్ పోషకాలు, ప్రయోజనాలు..

→ బ్లాక్ బీన్ లో ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, మెగ్నీషియం,  ఫైబర్, ఫోలేట్, కాపర్, విటమిన్ బి1, ఫాస్పరస్, మాంగనీస్, ఐరన్‌, జింక్‌, కాల్షియం, థియామిన్, రైబోఫ్లేవిన్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి.

→  బ్లాక్ బీన్స్‌ ఆరోగ్యానికి మేలు చేయ‌డంతో పాటు ఎన్నో జ‌బ్బుల‌కు కూడా చెక్ పెడతాయి.

→  శాఖాహారుల్లో ఎక్కువ మంది ప్రోటీన్ లోపంతో బాధ ప‌డుతుంటారు. అలాంటి వాళ్ళు బ్లాక్ బీన్స్ తీసుకుంటే శ‌రీరానికి స‌రిప‌డా ప్రోటీన్ అందుతుంది.

→  లైంగిక పని తీరు, సంతానోత్పత్తిని మెరుగుప‌ర‌చ‌డంలోనూ బ్లాక్ బీన్స్ ఉప‌యోగ‌ప‌డ‌తాయి. అందువ‌ల్ల‌  సంతాన‌లేమి, లైంగిక స‌మ‌స్య‌లు ఎదుర్కొనే వారు డైట్‌లో బ్లాక్ బీన్స్ చేర్చుకుంటే మంచిది.

→  బ్లాక్ బీన్స్ తీసుకోవ‌డం వ‌ల్ల ఎముక‌లు, కండ‌రాలు దృఢంగా మార‌తాయి. కీళ్ల నొప్పులు దూరం అవుతాయి.

→  మ‌ధుమేహం వ్యాధి గ్ర‌స్తులు బ్లాక్ బీన్స్‌ను డైట్‌లో చేర్చుకుంటే.. ర‌క్తంలో చక్కెర స్థాయిలు ఎప్పుడూ స్థిరంగా ఉంటాయి.

→  బ్లాక్ బీన్స్‌లో కార్బోహైడ్రేట్స్ రెసిస్టెంట్ స్టార్చ్‌గా లభిస్తాయి. ఇవి ఒత్తిడిని దూరం చేస్తాయి. పేగులని ఆరోగ్యంగా ఉంచుతాయి. పేగుల్లోని బ్యాక్టీరియాని బయటికి పంపేలా చూస్తాయి.

→ వీటిలో కొలెస్ట్రాల్ ఉండదు. వీటిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.

బ్లాక్ బీన్స్‌లోని డైటరీ ఫైబర్ బాడీలోని చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది.ఫలితంగా గుండె ఆరోగ్యం బెటర్ అవుతుంది. బరువు కూడా తగ్గుతుంది.

బ్లాక్ బీన్స్‌లో అధిక మొత్తంలో ఉండే డైటరీ ఫైబర్ ఆకలిని కంట్రోల్ చేస్తుంది. ఎక్కువసేపు కడుపు నిండుగా ఉన్న ఫీలింగ్‌ని ఇస్తుంది. దీంతో ఎక్కువ కేలరీలు తీసుకోకుండా చేస్తుంది. బరువు తగ్గేలా చేస్తుంది.

బ్లాక్ బీన్స్‌లోని పాలిఫెనిల్స్ మంచి యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది.

→ బ్లాక్ బీన్స్‌లో ఉండే పాలీఫినైల్స్, ఫ్లేవనాయిడ్స్, ఆంథోసైనిన్లు ఇన్ఫెక్షన్లతో పోరాడే యాంటీ ఆక్సిడెంట్స్‌గా పనిచేస్తాయి.

​​గమనిక: ఈ వార్తలోని వివరాలను మెడికల్ ఎక్స్ పర్ట్స్ అభిప్రాయం, విశ్లేషణ, అధ్యయన నివేదికల ప్రకారం అందించాం. ఇది కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం.