Site icon HashtagU Telugu

Mango: వేసవిలో మామిడిపండ్ల జ్యూస్ తాగుతున్నారా.. అయితే ఇది మీకోసమే!

Mangoes

Mangoes

వేసవికాలం వచ్చింది అంటే చాలా మంది మామిడి పండ్ల కోసం ఎదురుచూస్తూ ఉంటారు.. ఈ మామిడి పండ్ల కోసం ఏడాది మొత్తం ఎదురు చూసే వారు కూడా ఉన్నారు. ఇకపోతే మామిడి పండ్ల వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం అందరికీ తెలిసిందే. మామిడి పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తినడం మంచిదే కానీ అతిగా తింటే మాత్రం సమస్యలు తప్పవు. మ్యాంగో ను అలాగే తినడం కంటే జ్యూస్ల రూపంలో సలాడ్ల రూపంలో ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు.

మామిడిపండ్ల లో విటమిన్ ఏ, విటమిన్ సి, ఫైబర్ తోపాటు అనేక రకాల పోషకాలు ఉంటాయి. మామిడి పండు రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి ఎంతగానో దోహదం చేస్తుంది. మామిడిపండు మన జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. చేసుకుని తాగే వారు కూడా లేకపోలేదు. వేసవిలో చాలామంది మామిడి పండు జ్యూస్ ను ఇష్టంగా తాగుతారు. అయితే కొన్ని రకాల అనారోగ్య సమస్యలతో బాధపడేవారు మ్యాంగో జ్యూస్ తాగకుండా ఉంటేనే మంచిదట. ఎందుకంటే మామిడిపండ్లలో సహజ చక్కెర ఉంటుందట. ఇక జ్యూస్ గా చేసుకున్నప్పుడు అందులో మరింత చక్కెరను యాడ్ చేస్తారు.

ఇది మధుమేహం బాధితులకు తీవ్ర అనారోగ్యానికి కారణమవుతుందని చెబుతున్నారు. బరువు తగ్గాలి అనుకునేవారు మ్యాంగో జ్యూస్ తాగకుండా ఉంటేనే మంచిదట. మ్యాంగో జ్యూస్ లో అధిక క్యాలరీలు ఉండడం వల్ల బరువు కూడా పెరిగే ప్రమాదం ఉంటుందట. కాబట్టి మ్యాంగో జ్యూస్ తాగకూడదట. ఇదే సమయంలో ఎవరైతే జీర్ణ సంబంధమైన సమస్యలతో బాధపడుతున్నారో వారు మ్యాంగో జ్యూస్ తాగకుండా ఉంటేనే మంచిదని,ఎసిడిటీ, గ్యాస్ సమస్యలతో బాధపడేవారు మ్యాంగో జ్యూస్ తాగకూడదని చెబుతున్నారు. కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడే వారు కూడా మ్యాంగో జ్యూస్ తాగకపోవడమే మంచిది అని చెబుతున్నారు. అటువంటి వారు కూడా మామిడిపండ్ల జ్యూస్ తాగితే అలర్జీలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వారు కూడా తాగకుండా ఉంటేనే మంచిదట.

Exit mobile version