Site icon HashtagU Telugu

‎Alcohol: ఏంటి ఇది నిజమా! చలికాలంలో మద్యం తాగితే చలి తగ్గుతుందా?

Alcohol

Alcohol

‎Alcohol: రోజు రోజుకి చాలా తీవ్రత పెరుగుతోంది. క్రమంగా ఉష్ణోగ్రతలు కూడా పడిపోతున్నాయి. ఉదయం 8 అయినా కూడా చలి తగ్గడం లేదు. అయితే ఈ చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడం కోసం ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందులో బాగానే కొంతమంది మందుబాబులు చలికాలంలో మద్యం సేవిస్తే చలి తగ్గుతుందని అని అనుకుంటూ ఉంటారు. మరి ఇందులో నిజా నిజాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. శీతాకాలం వచ్చేసింది. చలి తట్టుకోలేక ఒక్క పెగ్గేస్తే హీటెక్కిపోతుంది.అని చాలామంది అంటుంటారు. అయితే కాసేపు వేడి అనిపించినా, అది తాత్కాలిక ప్రభావమేనని వైద్య నిపుణులు చెబుతున్నారు.

‎మద్యం తాగిన తర్వాత శరీరానికి వేడి అనిపిస్తుందని, కానీ అసలు ఉష్ణోగ్రత తగ్గిపోతుందని చెబుతున్నారు నిపుణులు. మద్యం శరీరంలోని రక్తనాళాలను విస్తరింపజేస్తుందట. దీంతో చర్మ ఉపరితలానికి రక్తప్రసరణ పెరిగి, వేడి అనిపిస్తుందట. కానీ అదే సమయంలో లోపలి అవయవాలకు రక్తప్రవాహం తగ్గుతుందని, దీనివల్ల శరీర ఉష్ణోగ్రత క్రమంగా పడిపోతుందని చెబుతున్నారు. మద్యం వల్ల శరీర ఉష్ణోగ్రత ఎలా తగ్గుతుంది? అన్న విషయానికి వస్తే.. సాధారణంగా చలి సమయంలో మన శరీరం రక్తనాళాలను సంకోచింపజేసి వేడి బయటకు వెళ్లకుండా కాపాడుతుందట. కానీ మద్యం తాగితే ఈ సహజ రక్షణ వ్యవస్థ దెబ్బతింటుందని, రక్తనాళాలు విస్తరించడం వల్ల చర్మం మీద వేడి పెరిగి బయటకు పోతుందట.

‎ఫలితంగా లోపలి అవయవాలు చల్లబడతాయని, శరీర ఉష్ణోగ్రత 35 డిగ్రీల కంటే తక్కువకు పడిపోతే దాన్ని అల్పోష్ణస్థితి అంటారు. ఈ పరిస్థితిలో తల తిరగడం, మతిమరుపు, స్పష్టంగా మాట్లాడలేకపోవడం, శరీరం వణకడం వంటి లక్షణాలు కనబడతాయట. తీవ్రమైన పరిస్థితుల్లో ప్రాణాపాయం కూడా సంభవించే అవకాశం ఉందని చెబుతున్నారు. కాగా నిజానికి చ‌లిలో ఆల్కహాల్ తాగడం వల్ల.. శరీరంలో వేడి త్వరగా బయటకు వెళ్తుందట. రక్తపోటు తగ్గుతుందట. గుండె స్పందన రేటు మారుతుందట. శరీరానికి సహజంగా వచ్చే వణుకు ప్రతిస్పందన అణిచిపోతుందని, చెబుతున్నారు. దీని వల్ల శరీరం చలికి మరింత బలహీనంగా మారుతుందట. ముఖ్యంగా గుండెజబ్బులు ఉన్నవారికి తీవ్రమైన ప్రమాదమట. శరీర ఉష్ణోగ్రత వేగంగా పడిపోవడం గుండెపోటు లేదా స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుందని చెబుతున్నారు.. ‎ఆల్కహాల్ ఒక మూత్రవిసర్జన కారకం. అంటే మద్యం తాగిన తర్వాత మూత్ర విసర్జన ఎక్కువగా జరుగుతుందట.

‎ శీతాకాలంలో మనం సాధారణంగా తక్కువ నీరు తాగుతాం కాబట్టి, డీహైడ్రేషన్ స‌మ‌స్య పెరుగుతుందట. శరీరంలో తేమ తగ్గిపోవడంతో ఉష్ణోగ్రతను నియంత్రించే సామర్థ్యం తగ్గుతుందట. ఇది చలిని మరింత పెంచుతుందని, అదనంగా, డీహైడ్రేషన్ వల్ల చర్మం పొడిబారడం, రక్తప్రసరణ మందగించడం, తలనొప్పి, అలసట వంటి సమస్యలు వస్తాయని చెబుతున్నారు. చలిని తగ్గించుకోవడానికి మద్యం తాగడం చాలా ప్రమాదకరం అని చెబుతున్నారు. అయితే ఇలా మద్యం సేవించడానికి బదులుగా ఉన్నిదుస్తులు, మఫ్లర్లు, గ్లౌవ్స్ ధరించడం మంచిదట. అలాగే సూప్, టీ, హాట్ వాటర్, విటమిన్ C పండ్లు తీసుకోవడం మంచిది. గది లోపల వేడి వాతావరణం కల్పించడం చేయాలి. చర్మానికి మాయిశ్చరైజర్‌లు ఉపయోగించడం మంచిది..

Exit mobile version