Health Problems: మీరు కూడా అలాంటి సమస్యలతో బాధపడుతున్నారా.. అయితే వాము అస్సలు తీసుకోకండి?

వాము వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. భారతీయులు చాలా రకాల వంటల్లో ఈ వాముని ఉపయోగిస్తూ ఉంటారు. అందుకే ప్ర

  • Written By:
  • Publish Date - January 10, 2024 / 05:00 PM IST

వాము వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. భారతీయులు చాలా రకాల వంటల్లో ఈ వాముని ఉపయోగిస్తూ ఉంటారు. అందుకే ప్రతి ఒక్కరు వంటింట్లో మసాలా దినుసులతో పాటుగా ఈ వాము కూడా తప్పనిసరిగా ఉంటుంది. పాము ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా గ్యాస్, అజీర్తి స‌మ‌స్య‌ల‌ను నివారిస్తుంది. అలాగే జ‌లుగు, ద‌గ్గు నుంచి ఉప‌ష‌మ‌నం పొండానికి కూడా ఎక్కువ‌గా ఉప‌యోగిస్తారు. వామును డైరెక్ట్ గా న‌మ‌ల‌డం గానీ లేదంటే నీళ్ల‌తో క‌లిపి తీసుకుంటారు. గొంతు స‌మ‌స్య‌లు, విష‌జ్వారాల‌ను కూడా త‌గ్గించ‌డంలో కూడా స‌హాయ‌ప‌డ‌తుంది.

వాము రుచి కారంగా, ఘాటుగా ఉంటుంది. ముఖ్యంగా ద‌గ్గు, జ‌లుబు, హైబీపీ, శ్వాస‌కోశ స‌మ‌స్య‌లు ఉన్న‌వారు వామును వాడితే వెంట‌నే ఉప‌ష‌మ‌నం ల‌భిస్తుంది. అలాగే ఇందులో విట‌మిన్లు, ఖ‌నిజాలు, ఫైబ‌ర్, యాంటిఆక్సిడెంట్స్ పుష్క‌లంగా ఉంటాయి. అలాగే విట‌మిన్ ఏ, సీ, ఈ, కే ల‌తోపాటు కాల్షియం, పొటాషియం, ఐర‌న్‌, పాస్ఫ‌ర‌స్ త‌దిత‌ర పోష‌కాలు కూడా వాములో ఉంటాయి. అందువ‌ల్ల మ‌న‌కు అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల నుంచి వాము ఉప‌శ‌మ‌నాన్ని ఇస్తుంది. అంతేకాకుండా వాములో ఉండే థైమిన్ అనే రసాయనం యాంటీ బ్యాక్టీరియల్ గా పనిచేసి ఫంగల్ ఇన్ ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది. దీంతో చాలా మంది వామును డైరెక్ట్ గా కాని ఫుడ్ ద్వారా తీసుకుంటారు.

వాట‌ర్ లో కూడా క‌లుపుకుని తాగ‌వ‌చ్చు. వాము ఆరోగ్యానికి మంచిదే కదా అని మోతాదుకు మించి తీసుకుంటే మాత్రం పలు రకాల అనారోగ్య సమస్యలు తప్పవు. గ్యాస్, మంట నుంచి ఉప‌ష‌మ‌నం పొంద‌డానికి చాలామంది వాము ను ఎక్కువ‌గా తీసుకుంటారు. దీని వ‌ల్ల యాసిడ్ రిఫ్ల‌క్స్, గ్యాస్ వంటి స‌మ‌స్య‌లు ఉత్ప‌న్న‌మ‌వుతాయి. అలాగే గ‌ర్భిణులు వామును తీసుకోక‌పోవ‌డ‌మే మంచిది. అలాగే వేడి ఎక్కువ‌గా ఉండేవారు కూడా వామును ఎక్కువ మొత్తంలో తీసుకోకూడ‌దు. అలాగే ఎల‌ర్జీ ఉన్న‌వారు కూడా వామును ఎక్కువ‌గా తీసుకోకూడ‌దు. దీనివ‌ల్ల వాంతులు, వికారం వంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయి. అంతేకాకుండా వామును డైరెక్ట్ గా అతిగా తీసుకుంటే నోటిలో మంట‌, పుండ్లు అయ్యే ప్ర‌మాదం ఉంటుంది. అందుకే వామును అవ‌స‌రం మేర‌కే తీసుకోవాలి. అలాగే పైన చెప్పిన సమస్యలు ఉన్నవారు కూడా వామును తీసుకోకపోవడం మంచిది.