Afternoon Nap పని ఒత్తిడి వల్లో లేదా అనారోగ్య సమస్యల వల్లో కొందరు ఉదయం పూట అది కూడా మధ్యాహ్నం వేళల్లో నిద్ర పోతుంటారు. అలా నిద్ర పోవడం వల్ల కొన్ని ప్రత్యేకమైన లాభాలు ఉన్నాయి అయితే ఆ నిద్ర ఎప్పుడు పోవాలి ఎంతసేపు పోవాలి అన్నది తెలుసుకుంటే అవకాశం ఉన్న వారు ఆఫ్టర్నూన్ టైం లో న్యాప్ వేసుకోవచ్చు. నిద్ర ఆరోగ్యానికి మంచిదే కానీ ఎప్పుడు పడితే అప్పుడు పడుకుంటే అది అనారోగ్యాలకు దారి తీస్తుంది.
మధ్యాహ్నం నిద్ర వల్ల ఇబ్బందులు ఉంటాయని అంటారు కానీ అది అసలేమాత్రం నిజం కాదు మధ్యాహ్నం నిద్ర వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టే అవకాశం ఉంది. మధ్యాహ్నం నిద్ర మానసిక ప్రశాంతత చేకూరుస్తుంది. నిద్ర వల్ల షుగ, థైరాయిడ్ వచ్చే అవకాశాలు తగ్గిస్తుంది.
మధ్యాహ్నం పడుకోవడం (Afternoon Nap) వల్ల హార్మోన్లు బాగా పనిచేస్తాయి. లంచ్ తర్వాత ఒక చిన్న కునుకు వేస్తే జీర్ణక్రియ కూడా బాగా జరుగుతుంది. హైబీపీని కూడా అది నియంత్రిస్తుంది. అయితే మధ్యాహ్నం నిద్ర అనారోగ్యంగా ఉన్న వారు 1 గంట నుంచి 3 గంటల మధ్య నిద్రించాల్సి ఉంటుంది. అంటే 2 గంటల నిద్ర మాత్రమే పోవాలి. ఆ తర్వాత నిద్రించకూడదు. ఒకవేల ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేని వారు 10 నుంచి 30 నిమిషాల వరకు మధ్యాహ్నం పడుకుంటే సరిపోతుంది. ఇంకా ఎక్కువ పడుకుంటే లేజీ నెస్ వచ్చేస్తుంది. చిన్నపిల్లు వృద్ధులైతే గరిష్టంగా 90 నిమిషాలు ఆఫ్టర్ నూన్ నిద్రపోవచ్చు.
Also Read : National Cinema Day : నేషనల్ సినిమా డే తేదీల్లో మార్పెందుకు..?