Hungry : కొంతమందికి ఏం తిన్నా మళ్ళీ త్వరగా ఆకలి వేస్తూ ఉంటుంది. దాంతో చాట్, మసాలాలు, బజ్జీలు అలా నూనె ఐటమ్స్ తినాలని అనిపిస్తుంది. పిజ్జా, బర్గర్, కేక్స్ ఇంకా బేకరీ ఐటమ్స్, లేదా ఏదో ఒక జంక్ ఫుడ్ కూడా తినాలని అనిపిస్తుంటుంది. కానీ ఇవన్నీ మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను పెంచే ఆహారపదార్థాలు. వీటి వలన మనం అధిక బరువు పెరగడానికి కారణమవుతాము. అలాగే జంక్ ఫుడ్ మన ఆకలిని ఇంకా పెంచుతాయి.
కాబట్టి మనకు అలాంటివి తినాలని అనిపించినప్పుడు, రెగ్యులర్ గా ఆకలి వేస్తున్నప్పుడు ఆరోగ్యకరమైన పదార్థాలు తింటే అవి మన ఆకలిని కూడా అదుపులో ఉంచుతాయి. ఫ్రూట్స్ లో ఆపిల్ తింటే మనకు ఆకలి తొందరగా వేయదు. అలాగే రెండు అరటిపళ్ళను తింటే కూడా మన కడుపు తొందరగా నిండుతుంది. ఇవి మన ఆకలిని అదుపులో ఉంచడమే కాకుండా మనం అధిక బరువు పెరగకుండా ఆపుతుంది.
బాదం పప్పులు, పల్లి చిక్కి తినడం వలన కూడా ఆకలి తగ్గుతుంది.
క్యారెట్ లు, బ్రకోలి, క్యాబేజి వంటివి ఆహారపదార్థాలలో భాగంగా తింటే మనకు ఆకలి అదుపులో ఉంటుంది. ఇవి తినడం వలన మనకు త్వరగా కడుపు నిండిన భావన కలుగుతుంది.
రొయ్యలు తినడం వలన కూడా ఆకలి అదుపులో ఉంటుంది. కాబట్టి ఎవరికైనా రెగ్యులర్ గా ఆకలి ఎక్కువగా వేస్తుంది, జంక్ ఫుడ్ తినాల్సి వస్తుంది అనిపిస్తే పైన చెప్పినవి మీ ఆహారంలో భాగం చేసుకోండి.
Also Read : Ice Apple : తాటిముంజలతో హల్వా, జ్యూస్ ఎలా తయారు చేయాలో తెలుసా..?
పైన చెప్పిన విషయాలు ఇంటర్నెట్ ఆధారంగా తీసుకొని మీకు అందచేయడమైనది. వీటిని హ్యాష్ ట్యాగ్ యు ధ్రువీకరించడం లేదు