Drinking Water: అన్నం తిన్న వెంటనే నీరు తాగుతున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే?

  • Written By:
  • Publish Date - March 11, 2024 / 04:29 PM IST

మనలో చాలామందికి అన్నం తినకముందు నీరు తాగే అలవాటు ఉంటే మరికొందరికి అన్నం తిన్న తర్వాత అన్నం తినేటప్పుడు మధ్యలో నీరు తాగే అలవాటు ఉంటుంది. అన్నం తినక ముందు నీరు తాగవచ్చు కానీ అన్నం తినేటప్పుడు అలాగే అన్నం తిన్న తర్వాత వెంటనే నీళ్లు తాగకూడదు అని వైద్యులు చెబుతున్నారు. మరి అన్నం తిన్న తర్వాత వెంటనే నీరు తాగితే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. నీరు మన శరీరానికి ఎంతో అవసరం. ఇది శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. విధుల్లో నిమగ్నమైన శరీరానికి విధుల్లో సాయపడుతుంది.

అయితే భోజనం చేసిన వెంటనే నీరు తాగడంవల్ల అనారోగ్య సమస్యలు కలుగుతాయి. మొదటిగా జీర్ణక్రియపై ప్రభావం పడుతుంది. నీరు తాగడంవల్ల కడుపులో ఉన్న యాసిడ్‌ పలుచన అవుతుంది. ఇది ఆహారాన్ని జీర్ణం చేయడం కష్టంగా మారుస్తుంది. దీని వల్ల గ్యాస్, అపానవాయువు, అజీర్ణం, మలబద్ధకం లాంటి సమస్యలు తలెత్తుతాయి. అందుకే ఆహారం తిన్నవెంటనే నీరు తాగకూడదని వైద్యులు సూచిస్తున్నారు. ఆహారం జీర్ణం కావడానికి ఉదర ఆమ్లం, ఇతర జీర్ణ రసాలు అవసరం. తిన్నవెంటనే నీటిని తీసుకోవడంవల్ల ఈ రసాలు పలుచన అవుతాయి. తాగునీరు పోషకాల శోషణను తగ్గిస్తుంది. శరీరంలో బలహీనత, అలసట, ఇతర ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది.

నీరు తాగడం వల్ల కడుపులో ఉండే ఆహారం, గాలి మధ్య ఉండే మిశ్రమం పలుచన అవుతుంది. దీనివల్ల కడుపులో గ్యాస్ ఏర్పడుతుంది. అపానవాయువు, నొప్పి, అసౌకర్యం వంటి సమస్యలు, అజీర్ణం, మలబద్ధకం ఏర్పడతాయి. కడుపులో చికాకు, పొక్కులు వంటి సమస్యలు వస్తాయి. భోజనం చేసేటప్పుడు నీరు తాగడానికి దూరంగా ఉండాలి. చిన్న పిల్లలు అన్నం తినేటప్పుడు నీరు తీసుకోవచ్చు. అయితే పెద్దవారు మాత్రం కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. ఆహారం జీర్ణం కావడానికి దాదాపు 2 గంటల సమయం పడుతుంది. అదే సమయంలో నీరు తాగడం వల్ల జీర్ణక్రియపై ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు భావిస్తున్నారు. ఆహారం తీసుకున్న 45 నుంచి 60 నిమిషాల తర్వాతే మంచినీరు తాగాలి. ఆహారం తినే అరగంట ముందు నీళ్లు తాగాలనే విషయాన్ని గుర్తుంచుకోండి. అదేవిధంగా అన్నం తినేటప్పుడు మధ్య మధ్యలో నీరు తీయడం వల్ల ఎక్కువ ఆహారాన్ని తీసుకోలేరు.