Site icon HashtagU Telugu

Health Tips: భోజనం చేసిన వెంటనే పొరపాటున కూడా ఈ 5 పనులు అస్సలు చేయకండి?

Health Tips

Health Tips

మామూలుగా మనం భోజనం చేసేటప్పుడు భోజనం చేసిన తర్వాత తెలిసి తెలియక చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటాం. వాటి వల్ల లేనిపోని సమస్యలను కొని తెచ్చుకుంటూ ఉంటాం. అందుకే భోజనం చేసిన వెంటనే కొన్ని పొరపాట్లు చేయకూడదని చెబుతూ ఉంటారు. ముఖ్యంగా భోజనం చేసిన తర్వాత ఈ ఐదు రకాల పనులు అస్సలు చేయకూడదని చెబుతున్నారు. ఇంతకీ ఆ పనులు ఏంటి అన్న విషయానికి వస్తే..

చాలామందికి భోజనం చేసిన తర్వాత టీ తాగే అలవాటు ఉంటుంది. ఇది చాలా చెడ్డ అలవాటు అంటున్నారు. బ్రేక్ ఫాస్ట్ లంచ్ తర్వాత టీ తాగే వారు ఇకమీదట మానుకోవడం మంచిది. ఎందుకంటే ఇందులో పెద్ద మొత్తంలో యాసిడ్ రిలీజ్ అయ్యి ఆహారం జీర్ణం అవడం కష్టం అవుతుంది. అలాగే భోజనం చేసిన తర్వాత ఎట్టి పరిస్థితులలో సిగరెట్ కాల్చరాదు. ఎందుకంటే భోజనం తర్వాత కాల్చే ఒక్కొక్క సిగరెట్ పది సిగరెట్ లతో సమానమట. అలా చేయడం వల్ల క్యాన్సర్ లాంటి పెద్ద పెద్ద సమస్యలను కొన్ని తెచ్చుకున్నట్టే అవుతుందని చెబుతున్నారు.

కాబట్టి ఇక మీదటనైనా భోజనం చేసిన తర్వాత సిగరెట్లను కాల్చడం మానుకోండి. అలాగే పళ్ళు తినకూడదట. భోజనం చేసిన తర్వాత పళ్ళు తినడం వల్ల కడుపు మొత్తం గాలితో నిండిపోతుంది. ఒకవేళ మీరు పళ్ళు తీసుకోవాలి అనుకుంటే భోజనానికి ఒక గంట ముందు కానీ తర్వాత గాని తినడం మంచిది. అంతేకానీ భోజనం చేసిన వెంటనే పండ్లు తింటే అది ఆరోగ్యానికి ప్రమాదాన్ని కలిగిస్తుంది అని చెబుతున్నారు. భోజనం చేయకూడదు తర్వాత చేయాల్సిన వాటిలో స్నానం చేయడం కూడా ఒకటి. చాలామంది ఈ విషయంలో పొరపాటు చేస్తూ ఉంటారు. భోజనం చేసిన తర్వాత స్నానం చేస్తే కాళ్లకు అదే విధంగా చేతులకు రక్తం సరఫరా ఎక్కువ అయ్యి జీర్ణక్రియ మందగిస్తుందని చెబుతున్నారు.

కాబట్టి మీరు స్నానం చేయాలి అనుకుంటే భోజనానికి ముందే స్నానం చేయడం మంచిది. ఒకవేళ భోజనం తర్వాత స్నానం చేయాలి అనుకుంటే కనీసం కొన్ని గంటల వ్యవధి అయినా సమయం ఉండేలా చూసుకోవాలి. అలాగే ఎప్పుడు కూడా భోజనం చేసిన వెంటనే పడుకోకూడదట. కనీసం కొన్ని నిమిషాల పాటు అయినా నడిచి ఆ తర్వాత మీ పనులు చూసుకోవడం మంచిది. అలా కాకుండా భోజనం చేసిన వెంటనే పడుకోవడం కూర్చోవడం లాంటివి చేయడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుందట. అంతేకాకుండా జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.