Health Benefits: చికెన్, చేపలు తిన్న తర్వాత పొరపాటున కూడా ఇవి తాగకూడదు.. తాగితే అంతే!?

చికెన్ లేదా చేపలు తిన్న వెంటనే పాలు తాగుతున్నారా అయితే మీరు ప్రమాదంలో పడ్డట్టే అని అంటున్నారు నిపుణులు.

  • Written By:
  • Publish Date - July 6, 2022 / 08:10 AM IST

చికెన్ లేదా చేపలు తిన్న వెంటనే పాలు తాగుతున్నారా అయితే మీరు ప్రమాదంలో పడ్డట్టే అని అంటున్నారు నిపుణులు. మరి చికెన్ చేపలు తిన్న తర్వాత వెంటనే పాలు తీసుకోవడం వల్ల కలిగే అనర్థాలు సమస్యలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. చికెన్,చేపలు వంటి మాంసాహారం తిన్న తర్వాత పాలు తీసుకోకూడదు. అలా చేయడం వల్ల అది జీర్ణ వ్యవస్థ పై ప్రభావం చూపుతుంది. పాలలో పూర్తిగా ప్రోటీన్లు, అమినో యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి అన్న విషయం తెలిసిందే. చికెన్ లో ప్రోటీన్ల శాతం అధికంగా ఉంటుంది. కాబట్టి చికెన్ తీసుకున్న వెంటనే అధిక ప్రోటీన్లు కలిగిన పాలను కూడా తీసుకోకూడదు.

ఈ రెండు పదార్థాలలో ఎక్కువ శాతం ప్రోటీన్లు ఉండడం వల్ల అది జీర్ణక్రియ పై ప్రభావం చూపిస్తుంది. చికెన్ తీసుకున్న తర్వాత వెంటనే పాలు తాగితే ఏర్పడే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది. అది క్రమంగా అనారోగ్యానికి దారితీస్తుందట. అదేవిధంగా అరటి పండు తో పాటుగా కోడిగుడ్డును కూడా తీసుకోవడం మంచిది కాదు అని ఆరోగ్యనిపుణులు సూచిస్తున్నారు. అయితే అధిక ప్రోటీన్స్ ఉన్న ఆహారాలను ఒకే సమయంలో తీసుకోవడం వల్ల హై బీపీ, అలాగ హృద్యోగ వ్యాధులు ఏర్పడే అవకాశం ఉంది.

అలాగే పాలతో కనిపి చికెన్ చేపలు కోడిగుడ్లు వంటివి కూడా తీసుకోవడం చాలా ప్రమాదకరం. మాంసాహారాలలో కూడా నూనెను అధికంగా ఉపయోగించకూడదు. నూనె లేని తందూరి వంటి వంటకాలను చేసుకోవడం ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం. అయితే మాంసాహారం తీసుకున్న తర్వాత వెంటనే కాకుండా ఒక 12 గంటల తర్వాత పాలను తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అప్పుడు మాంసాహారం పూర్తిగా జీర్ణం అవుతుందని అలా కాకుండా వెంటనే తీసుకోవడం వల్ల అలర్జీలకు దారి తీసే అవకాశం ఎక్కువగా ఉంది అని వారు హెచ్చరిస్తున్నారు. కడుపులో ఉండే జీర్ణ రసాల్లో నిమ్మకాయ కంటే అత్యధికంగా యాసిడ్ గుణాలు కలిగి ఉంటాయి. పాలు, నిమ్మకాయ కాంబినేషన్లు వంటకాలు కూడా తీసుకోకూడదు. అదేవిధంగా పుచ్చకాయ తిన్న వెంటనే నీటిని తాగరాదు. అలాగే టీ పెరుగు రెండింటిని ఒకేసారి తీసుకోకూడదు.