Dinner Walking: రాత్రి భోజనం తర్వాత న‌డుస్తున్నారా..? అయితే మీకు క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఇవే..!

Dinner Walking: పరుగు, నడక మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో మనందరికీ తెలుసు. చాలా మంది తమను తాము ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉంచుకోవడానికి ర‌న్ చేస్తారు. రాత్రి డిన్నర్ (Dinner Walking) చేసిన తర్వాత కూడా చాలా మంది బయటికి వాకింగ్ కు వెళ్తారు. కానీ రాత్రి భోజనం చేసిన తర్వాత వాకింగ్ చేయడం ఎందుకు ముఖ్యం..? రాత్రి భోజనం తర్వాత వేగంగా లేదా నెమ్మదిగా నడవాలా..? ఎంతసేపు నడక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది? ఇలాంటి […]

Published By: HashtagU Telugu Desk
Dinner Walking

Dinner Walking

Dinner Walking: పరుగు, నడక మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో మనందరికీ తెలుసు. చాలా మంది తమను తాము ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉంచుకోవడానికి ర‌న్ చేస్తారు. రాత్రి డిన్నర్ (Dinner Walking) చేసిన తర్వాత కూడా చాలా మంది బయటికి వాకింగ్ కు వెళ్తారు. కానీ రాత్రి భోజనం చేసిన తర్వాత వాకింగ్ చేయడం ఎందుకు ముఖ్యం..? రాత్రి భోజనం తర్వాత వేగంగా లేదా నెమ్మదిగా నడవాలా..? ఎంతసేపు నడక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది? ఇలాంటి ప్ర‌శ్న‌ల‌ను మీరు ఎప్పుడైనా ఆలోచించారా. రాత్రి భోజనం చేసిన తర్వాత ఎలా నడవాలి..? దాని వల్ల ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

రాత్రి వేగవంతమైన నడకను త‌గ్గించండి

రాత్రి భోజనం ఎంత త్వరగా తీసుకుంటే ఆరోగ్యానికి అంత మేలు. రాత్రి 7 నుండి 8 గంటల మధ్య రాత్రి భోజనం చేస్తే వెంటనే నడకకు వెళ్లకండి. రాత్రి భోజనం చేసిన తర్వాత కనీసం 1 గంట నడవండి. రాత్రిపూట పొరపాటున కూడా వేగంగా నడవకూడదు. రాత్రి భోజనం చేసిన తర్వాత ఎప్పుడూ తీరికగా నడవండి. అరగంట నుండి 1 గంట వరకు సాధారణంగా నడవండి. దీని వల్ల మీకు ఎలాంటి హాని జరగదు.

భోజనం తర్వాత నడవడం వల్ల కలిగే ప్రయోజనాలు

ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయపడుతుంది

ఆహారం తిన్న తర్వాత అరగంట పాటు నడిస్తే ఆహారం తేలికగా జీర్ణమై జీర్ణశక్తి బలంగా ఉంటుంది. అదే సమయంలో ఆహారం తిన్న వెంటనే నిద్రకు ఉపక్రమిస్తే ఆహారం సరిగా జీర్ణం కాక జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు వస్తాయి.

జీవక్రియను వేగవంతం చేస్తాయి

రాత్రి భోజనం తర్వాత నడవడం వల్ల జీవక్రియ మెరుగుపడుతుంది. వేగంగా పెరుగుతుంది. దీనితో పాటు, బరువు నియంత్రణలో ఉంటుంది.

Also Read: Team India: టీమిండియా ఆటగాళ్లు బీ అలర్ట్.. పాక్ తో జర జాగ్రత్త, ఎందుకంటే

రోగనిరోధక శక్తిని పెంచుతాయి

మీరు రాత్రి భోజనం చేసిన తర్వాత రోజూ వాకింగ్ చేస్తే అది మీ బలహీనమైన రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. సీజనల్ వ్యాధుల నుండి సురక్షితంగా ఉండగలరు. ఆహారం తిన్న తర్వాత వాకింగ్ చేయడం వల్ల గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

We’re now on WhatsApp : Click to Join

నిద్రను మెరుగుపరుస్తుంది

రాత్రి భోజనం చేసిన తర్వాత వాకింగ్ చేయడం నిద్రకు మేలు చేస్తుంది. నిజానికి రాత్రిపూట నడవడం వల్ల శరీరంలో ఎండార్ఫిన్ హార్మోన్లు విడుదలవుతాయి. ఈ హార్మోన్ మెదడును ఆరోగ్యంగా ఉంచడానికి పని చేస్తుంది. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది. నిద్రను మెరుగుపరుస్తుంది.

  Last Updated: 29 May 2024, 11:52 PM IST