Vaccine: పెద్ద‌ల‌తో పోలీస్తే టీనేజ‌ర్ల‌లో ప్ర‌తికూల చ‌ర్య‌లు తక్కువ‌!

క‌రోనా వ్యాక్సినేషన్ వల్ల వచ్చే ప్రతికూల ప్రతిచర్యలు పెద్దవారితో పోలిస్తే టీనేజర్లలో చాలా తక్కువగా ఉంటాయని నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ (ఎన్‌టిఎజిఐ) చీఫ్ డాక్టర్ ఎన్.కె. అరోరా తెలిపారు.

  • Written By:
  • Updated On - January 19, 2022 / 04:15 PM IST

క‌రోనా వ్యాక్సినేషన్ వల్ల వచ్చే ప్రతికూల ప్రతిచర్యలు పెద్దవారితో పోలిస్తే టీనేజర్లలో చాలా తక్కువగా ఉంటాయని నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ (ఎన్‌టిఎజిఐ) చీఫ్ డాక్టర్ ఎన్.కె. అరోరా తెలిపారు. భారతదేశంలో 15-18 సంవత్సరాల మధ్య పిల్లలకు ఇస్తున్న కోవాక్సిన్ సురక్షితమైనదన్నారు. టీకా వేసిన 2 నుండి 12 గంటలలోపు అలెర్జీ, ఇంజెక్షన్ చేసిన ప్రదేశంలో దురద వంటి ఏవైనా ప్రతికూల ప్రతిచర్యలు సంభవించినట్లయితే సమీపంలోని ఆరోగ్య సంరక్షణ కేంద్రానికి వెళ్లాల‌ని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సొంతగా మందుల‌ను వాడ‌కూడ‌ద‌ని డాక్టర్ అరోరా హెచ్చరించారు.

క‌రోనా వ్యాక్సిన్‌లు తీసుకుంటున్న యువకులు పారాసెటమాల్ తీసుకోకూడదని వైద్యులు కూడా సలహా ఇస్తున్నారు. వ్యాక్సిన్‌ని స్వీకరించిన తర్వాత మూడు 500 mg పారాసెటమాల్ మాత్రలు తీసుకోవాలని కొన్ని రోగనిరోధక కేంద్రాలు పిల్లలకు సలహా ఇస్తున్నాయన్న ఆందోళ‌న‌తో ఈ హెచ్చ‌రిక‌లు వ‌చ్చాయి. టీకా వేసిన మొదటి, రెండు రోజులలో తక్కువ-స్థాయి జ్వరం, కండరాల నొప్పి, బద్ధకం, తలనొప్పి, ఇంజక్షన్ సైట్ వద్ద పుండ్లు పడడం సాధారణం… ఎటువంటి మందులు లేకుండా స్వయంగా తగ్గిపోతుందని డాక్టర్ అక్షయ్ బుధ్రాజా అన్నారు. అయినప్పటికీ, జ్వరం కొనసాగితే లేదా తీవ్రత పెరిగినట్లయితే, వైద్యుడిని సంప్రదించిన తర్వాత పారాసెటమాల్, ఇతర నొప్పి నివారణ మందులు తీసుకోవాల‌ని తెలిపారు. కాబట్టి పారాసెటమాల్‌ను వైద్యుల‌ను సంప్రదించిన త‌రువాత మాత్ర‌మే వినియోగించాల‌ని ఆయ‌న అన్నారు.

క‌రోనా వ్యాక్సిన్‌లను స్వీకరించే పిల్లలకు (15-18 సంవత్సరాల వయస్సు) పారాసెటమాల్ ఇవ్వడం సిఫారసు చేయబడలేదని ఇండియన్ స్పైనల్ ఇంజూరీస్ సెంటర్ డాక్టర్ కల్నల్ విజయ్ దత్తా తెలిపారు. ఎందుకంటే ఇది వారిలో హెపాటోటాక్సిసిటీ (డ్రగ్ ఎక్స్‌పోజర్ వల్ల కాలేయం దెబ్బతింటుంది) కలిగించే అవకాశం ఉందని.. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత పిల్లలకు జ్వరం వస్తే, వారికి మెఫెనామిక్ యాసిడ్ లేదా మెఫ్టల్ సిరప్ ఇవ్వాలన్నారు.కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత జ్వరం వచ్చిన 18 ఏళ్లు పైబడిన పెద్దలు పారాసెటమాల్ తీసుకోవడం సురక్షితమ‌ని డాక్టర్ కల్నల్ విజయ్ దత్తా తెలిపారు. “వ్యాక్సిన్ సంబంధిత జ్వరం సాధారణంగా టీకా వేసిన 24 గంటలలోపు వస్తుందని. టీకాలు వేసిన తర్వాత అరగంట పాటు టీకా కేంద్రంలో వేచి ఉండటం తప్పనిసరి అని అపోలో టెలిహెల్త్‌లోని పిల్లల సలహాదారు డాక్టర్ శ్వేతారెడ్డి పాసం అన్నారు. అలాగే తగినంత హైడ్రేషన్, విశ్రాంతి మరియు నిద్ర – రోజూలాగానే, టీకాలు వేసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సరిపోతాయన్నారు.