Site icon HashtagU Telugu

Hibiscus Tea: మందారాలతో ఈ విధంగా చేస్తే చాలు ఈజీగా బరువు తగ్గడం ఖాయం?

Mixcollage 04 Feb 2024 08 07 Am 1876

Mixcollage 04 Feb 2024 08 07 Am 1876

ఈ రోజుల్లో చాలామందిని వేధిస్తున్న సమస్య అధిక బరువు. అయితే అధిక బరువు సమస్య నుంచి బయటపడటానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. జిమ్ కి వెళ్లడం వ్యాయామాలు చేయడం డైట్ ఫాలో అవ్వడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇలా ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా కొంచెం కూడా బరువు తగ్గరు. దాంతో ఏం చేసి బరువు తగ్గాలి అని తెగ ఆలోచిస్తూ ఉంటారు. అయితే శరీరంలో కొవ్వు కరిగించడం వల్ల అధిక బరువు తగ్గడంతో పాటు పొట్ట కూడా నార్మల్ గా అవుతుంది. అందుకే బరువు తగ్గడం కోసం చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొందరు కష్టపడి ఆసనాలు, వ్యాయామాలు చేస్తూ ఉంటే మరి కొందరు మాత్రం ఆహారం విషయంలో కాస్త ఆంక్షలు పాటిస్తూ ఉంటారు.

ఎంతగా ప్రయత్నిస్తూ ఉన్నా కూడా కొందరు లావు తగ్గడం జరగదు. అలాంటి వారి కోసం మందార టీ అద్బుత ఔషదం అంటూ నిపుణులు చెబుతున్నారు. అయితే బరువు తగ్గాలనుకునే వారు మందార పువ్వుతో తయారు చేసిన టీ ని తాగడం వల్ల శరీరంలో ఉన్న వృదా కొవ్వు అంతా కరిగిస్తుంది. మందారంలో ఉన్న పాలీఫినాల్స్‌, ఆంథోసయనిన్స్‌, ఫినోలిక్‌ సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. ఇవి మానవ శరీరంలోని కొవ్వుపై అధికంగా ప్రభావం చూపిస్తాయట. తరచుగా మందారం టీ తాగడం వల్ల శరీరంలో పేరుకు పోయి ఉన్న కొవ్వును తొలగించడంతో పాటు కొత్తగా కొవ్వు పేరుకు పోకుండా చూసుకుంటుంది.

పెద్ద పేగులో ఉండే కొవ్వు పదార్థాలను క్లీన్‌ చేయడం వల్ల బరువు తగ్గే అవకాశం ఉంటుంది. ఆ పనిని మందార పువ్వు టీ చేస్తుంది. ఇంతకీ మందార టీ తయారీ..మందార పూలను బాగా ఎండబెట్టి తొడిమె తొలగించి భద్రపర్చుకోవాలి. 500 ఎంఎల్‌ నీటిని తీసుకుని వేడి చేసి అందులో 50 గ్రాముల ఎండు మందార పువ్వులను వేయాలి. కనీసం పది నిమిషాల పాటు మరిగిన తర్వాత వడగట్టుకోవాలి. ఆ నీటిని చల్లార్చి తాగేయాలి. రుచి కోసం చెక్కర కాకుండా రెండు టీ స్పూన్‌ ల తేనెను వేసుకోవాలి. తేనె అందుబాటు లో లేకుంటే బెల్లం అయినా పర్వాలేదు. 500 ఎంఎల్‌ మందార పూల టీ ని రోజులో మూడు లేదా నాలుగు సార్లు తాగితే ఆరోగ్యానికి అన్ని విధాలుగా మంచిది.

Exit mobile version