Beer Drinking: బీర్ తో అధిక బరువు సమస్యలకు చెక్.. శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారంటే?

ప్రస్తుత రోజుల్లో చాలామంది అధిక బరువు సమస్యతో అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. బరువు తగ్గడం

  • Written By:
  • Publish Date - September 22, 2022 / 09:20 AM IST

ప్రస్తుత రోజుల్లో చాలామంది అధిక బరువు సమస్యతో అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. బరువు తగ్గడం కోసం అనేక రకాల వ్యాయామాలు డైటింగ్ లు చేస్తున్నప్పటికీ మార్పులు కనిపించకపోవడంతో కాస్త నిరాశ వ్యక్తం చేస్తూ ఉంటారు. అయితే బరువు తగ్గాలి అనుకున్న వారికి చక్కటి శుభవార్త. అధిక బరువు సమస్యతో బాధపడేవారు బీరు తాగడం వల్ల ఆ సమస్యకు పెట్టవచ్చట. అదే ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. చాలామంది బీర్ తాగితే స్ట్రెస్ తగ్గుతుంది అని తీశాలకు సీసాలు తాగేస్తూ ఉంటారు.

అయితే బీర్‌ స్ట్రెస్‌ నే మాత్రమే కాదు సర్వరోగ నివారిణిగా మారిందని అంటున్నారు లండన్‌ శాస్త్రవేత్తలు. పైగా బీర్‌ తాగడం వల్ల పొట్ట పెరుగుతుందని చాలామందిలో ఉన్న అపోహకు పెట్టేశారు. కాగా ఇటీవల జరిగిన కొన్ని సర్వే లలో బీర్‌ తాగితే పొట్ట రాదని బీర్ డైట్‌గా మారుతోందని తేలిందట. అలాగే సరదాగా తాగే బీర్ వలన దుష్ప్రభావాలు ఎన్ని ఉన్నాయో ప్రయోజనాలూ అన్ని ఉన్నాయని అంటున్నారు లండన్‌ శాస్త్రవేత్తలు. బీర్‌ తాగడం వల్ల పొట్ట తగ్గడంతో పాటు స్లిమ్‌గా తయారవుతారని చెప్పడంతో పెగ్గులకు పెగ్గులు ఖాళీ చేసేందుకు రెడీ అవుతున్నారు.

పైగా శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనంలో బీర్‌ తాగడం వల్ల బెల్లీ ఫ్యాట్‌ వస్తుందనేది అబద్ధమని తేల్చి చెప్పేశారు. కొవ్వు పెరగడం, పొట్ట రావడం సంగతి అటుంచితే బీరులోని ప్లేవనాయిడ్లు బరువు తగ్గించడానికి తోడ్పడుతాయని రిపోర్టులలో తేలిందట. కాగా ఈ వార్త విన్న మందుబాబులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.