వేసవిలో దొరికే పండ్లలో కీర దోసకాయ కూడా ఒకటి. కీర దోసకాయ వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్న విషయం మనందరికీ తెలిసిందే. అందుకే సమ్మర్లో చాలామంది వీటిని తెగ తినేస్తూ ఉంటారు. ఇందులో కేలరీలు, కొవ్వు, కొలెస్ట్రాల్ , సోడియం తక్కువగా ఉన్నందున, ఇది అనేక ఇతర మార్గాల్లో మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు ఎంతో అవసరమయ్యే విటమిన్-కె, విటమిన్-డి వంటి పోషకాలు ఇందులో ఎక్కువగా ఉన్నాయి. మధుమేహం నుండి గుండె జబ్బులు, ఎముకలను ఆరోగ్యంగా ఉంచడం వరకు, దోసకాయ తీసుకోవడం మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
దోసకాయలో నీటితోపాటు పీచు, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో అనేక రకాల విటమిన్-బి, విటమిన్ ఎ యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉన్నాయి, ఇవి శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయి. యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే సమస్యల నుండి శరీరాన్ని రక్షించడంలో సహాయపడతాయి. దోసకాయలు తినడం మంచిదే కానీ మితిమీరి దోసకాయలు తినడం వల్ల అనారోగ్య సమస్యలు తప్పవు అంటున్నారు నిపుణులు.. మరి దోసకాయ తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కొన్ని సందర్భాల్లో, దోసకాయలు తినడం కూడా హాని కలిగిస్తుంది.
పెస్టిసైడ్స్ ఉపయోగించి దోసకాయలను పండించి ఉంటారు కాబట్టి ఎప్పుడైనా దోసకాయను తినేటప్పుడు పొట్టు తీసేసి తినాలి లేదంటే వాటిని శుభ్రం చేసి ఆ తర్వాత తినాలి. సైన సైటిస్‌తో బాధపడేవారికి అంత దోసకాయ మంచిది కాదు. గర్భిణీ స్త్రీలు దోసకాయలను ఎక్కువగా తినడం ద్వారా అజీర్ణం లేదా అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి. అలాగే, దోసకాయలో అధిక మొత్తంలో నీరు ఉండటం వల్ల, గర్భిణీ స్త్రీలు కూడా తరచుగా మూత్రవిసర్జనకు గురవుతారు. కొంతమందికి దోసకాయకు అలెర్జీ ఉంటుంది, ఇది వాపు, దురదను కలిగిస్తుంది. దోసకాయలు కుకుర్బిటాసిన్లు టెట్రాసైక్లిక్ ట్రైటెర్పెనాయిడ్స్ అనే విషపూరిత సమ్మేళనాలను కూడా కలిగి ఉంటాయి. ఇది కొన్నిసార్లు దోసకాయకు చేదు రుచిని ఇస్తుంది. ఎవరైనా దోసకాయను తినాలి అనుకున్నప్పుడు మితిమీరి తీసుకోకూడదు. పగలు సమయంలో మాత్రమే తీసుకోవాలి రాత్రి సమయంలో దోసకాయను తినకూడదు.