‎Health Tips: గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగుతున్నారా.. అయితే ఇది మీకోసమే!

‎Health Tips: గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగే అలవాటు ఉన్నవారు తప్పకుండా కొన్ని విషయాలను లేదంటే అనారోగ్య సమస్యలు తప్పవు అని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

Published By: HashtagU Telugu Desk
Health Tips

Health Tips

‎Health Tips: వేడి లేదా గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్‌ తేనె కలిపి తాగే అలవాటు మనలో చాలామందికి ఉంటుంది. బరువు తగ్గడం కోసం, అలాగే జీర్ణ సమస్యలు ఉన్నవారు ఇంకా కొన్ని రకాల ప్రయోజనాలు కోసం తాగుతూ ఉంటారు. కాగా ఉదయాన్నే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిలో నిమ్మ రసం కలిపి తాగే అలవాటు ఆరోగ్యానికి హానికరమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. తరచూ గోరువెచ్చని నీళ్లలో నిమ్మ రసం కలిపి తాగే అలవాటు  మీకూ ఉంటే ఈ రోజే మానేయాలన. ఎందుకంటే ఇది అనేక ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది.

‎ముఖ్యంగా యాసిడ్ రిఫ్లక్స్, గ్యాస్ట్రిటిస్, అల్సర్ ఉన్నవారికి గోరువెచ్చని నీటిలో నిమ్మకాయ కలిపి తాగడం ప్రమాదకరమని, ఇది ఆరోగ్య సమస్యలను పెంచుతుందని చెబుతున్నారు. నిమ్మకాయలలోని ఆమ్లం దంతాల ఎనామిల్‌ ను నెమ్మదిగా క్షీణింపజేస్తుందట. దీనివల్ల దంత క్షయం వచ్చే ప్రమాదం పెరుగుతుందట. ఫలితంగా దంతాల ఆరోగ్యం వేగంగా దెబ్బతింటుందని చెబుతున్నారు. గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగడం వల్ల ప్రేగులపై కూడా తీవ్రమైన ప్రతికూల ప్రభావాలు ఉంటాయట. ఈ నీటిని రోజుకు ఒకసారి తాగడం మంచిది.

‎అయితే అంతకంటే ఎక్కువగా తాగకూడదట. వేడి నీటిలో నిమ్మకాయను తేనెతో కలిపి తాగడం వల్ల దంత సమస్యలు పెరుగుతాయని, ఎందుకంటే నిమ్మకాయల్లో సిట్రిక్ యాసిడ్ ఉంటుందని, ఇది దంతాల ఎనామిల్‌ ను బలహీనపరుస్తుందని ఇది దంతక్షయానికి దారితీస్తుందని, కాబట్టి తేనెతో నిమ్మకాయ కలిపిన నీరు తాగకపోవడమే మంచిదని చెబుతున్నారు. ఒకవేళ మీరు నిమ్మకాయ గోరు వెచ్చని నీరు తాగాలి అనుకుంటే తప్పకుండా వైద్యుల సలహా తీసుకోవాలట.

  Last Updated: 15 Dec 2025, 06:10 AM IST