Site icon HashtagU Telugu

Back Pain : ఏళ్ల నుంచి వెన్నునొప్పి వేధిస్తోందా? అయితే ఈ 5 పదార్థాలు మీ ఆహారంలో చేర్చుకోండి!

Backpain Remedies

Backpain Remedies

నేటి కాలం వెన్నునొప్పి (Back Pain) సమస్య చాలా సాధారణమైంది. ఈ సమస్య అన్ని వయసుల వారిలోనూ ఎక్కువగా కనిపిస్తుంది. అయితే యువతలో కూడా వెన్నునొప్పి సమస్య మరీ ఎక్కువగా కనిపిస్తుంది. ఇది తరచుగా శరీరంలో పోషకాల కొరత, భారీ వ్యాయామాలు లేదా భారీ వస్తువులను ఎత్తినప్పుడు ఇలాంటి సమస్యగా ఎక్కువగా ఎదురవుతుంది. అయితే మీరు ఆహారంలో కొన్నింటిని జోడించుకోవడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.
వెన్నునొప్పి సమస్య నుండి ఉపశమనం కలిగించే ఆహారాలేంటో చూద్దాం.

1. గుడ్డు:

గుడ్డులో క్యాల్షియం, విటమిన్ డి పుష్కలంగా ఉంటాయి. మీ ఎముకలకు ఎంతో బలాన్నిస్తుంది. మీకు వెన్నునొప్పి ఉంటే, ప్రతిరోజూ ఆహారంలో గుడ్డును చేర్చుకోవచ్చు. దీనిని ఉడకబెట్టి కానీ లేదా బూర్జి రూపంలో తీసుకోవచ్చు.

2. పసుపు:
పసుపులో ఔషధ గుణాలున్నాయని అందరికీ తెలిసిందే. దీనితో పాటు, ఇది ఇన్ఫెక్షన్ నుండి శరీరాన్ని రక్షించడంలో కూడా సహాయపడుతుంది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. మీరు కూడా వెన్నునొప్పితో బాధపడుతున్నట్లయితే, మీరు పసుపు టీ లేదా పాలు కూడా తీసుకోవచ్చు.

3. అల్లం :
వెన్నునొప్పి నుండి ఉపశమనం పొందడంలో అల్లం కూడా ప్రభావవంతంగా ఉంటుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు వెన్నునొప్పి సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తాయి. దీని కోసం, మీరు 2 టీస్పూన్ల అల్లం రసంలో 1 టీస్పూన్ తేనె కలిపి తినొచ్చు.

4. డార్క్ చాక్లెట్:
డార్క్ చాక్లెట్ వెన్నునొప్పిని తొలగించడానికి సహాయపడుతుంది. ఇందులో మెగ్నీషియం మూలాలున్నాయి. , ఇది ఎముకలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. శరీరంలో మెగ్నీషియం లేకపోవడం వెన్నునొప్పి, లేదా ఇతర సమస్యలను కలిగిస్తుంది. డార్క్ చాక్లెట్, షేక్, స్వీట్లు లేదా చక్కెరతో కూడిన కోకో పౌడర్ చాలా ప్రయోజనకరంగా ఉంటాయి.

5. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్:
ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే ఆకు కూరలు తినాలి. వీటిలో విటమిన్ కె, క్యాల్షియం, ఐరన్, ఇతర పోషకాలు పుష్కలంగా ఉన్నాయి, ఇవి వెన్నునొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి.