Site icon HashtagU Telugu

Acidity: ఎసిడిటీ రాకుండా ఉండాలంటే ఏం చేయాలో మీకు తెలుసా?

Acidity

Acidity

ప్రస్తుత రోజుల్లో చాలామందిని వేధిస్తున్న సమస్యలలో ఎసిడిటీ సమస్య ప్రధాన సమస్యగా మారిపోయింది. చిన్న పెద్ద తేడా లేకుండా చాలామంది ఈ సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఆమ్లాలు ఎక్కువగా స్రవించినప్పుడు అసిడిటీ సమస్య వస్తుంది. స్రావం సాధారణం కంటే ఎక్కువగా ఉన్నప్పుడు గుండెల్లో మంట రావడం అన్నది సాధారణం. మాములుగా ఈ సమస్య ఆహారాన్ని తినడం వల్లే వస్తుంది. భోజనం చేసిన వెంటనే గుండెల్లో మంట, ఉబ్బరంగా అనిపించడం ఎసిడిటీ లక్షణాలు. అయితే ఈ ఎసిడిటీ వల్ల కొంతమందికి కడుపు నొప్పి కూడా వస్తుంది. దీనికి చికిత్స తీసుకోకపోతే అల్సర్లు వస్తాయి.

ఆ తర్వాత ఇది ప్రమాదకరమైన అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. అందుకే ఎసిడిటీ రాకుండా చూసుకోవాలట. ఎసిడిటీ రాకుండా ఉండేందుకు ఎలాంటి చిట్కాలను ఫాలో కావాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కెఫిన్ కంటెంట్ ఉన్న ఆహారాలను వీలైనంత దూరంగా ఉండడం లేదా చాలా వరకు తగ్గించడం మంచిదని చెబుతున్నారు. అలాగే ప్రతిరోజూ ఉదయం గోరువెచ్చని నీటిని తాగాలట. అరటిపండ్లు, పుచ్చకాయలు, దోసకాయలను వంటి ఫ్రూట్స్ ని మీ డైట్ లో చేర్చుకోవాలని చెబుతున్నారు. ఇవి మీ శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతాయట. ప్రతిరోజూ ఒక గ్లాసు పాలను తాగాలట.

రాత్రిళ్లు నిద్ర పోవడానికి రెండు గంటల ముందే తినాలట. ఊరగాయలను క్రమం తప్పకుండా తినడం మానుకోవాలట. పుదీనా ఆకుల నీటిని తాగడం అలవాటు చేసుకోవాలట. అలాగే భోజనం తర్వాత లవంగాలను నోట్లో వేసుకుని నమలడం వల్ల ఎసిడిటీని నియంత్రించవచ్చట. మితిమీరిన ధూమపానం, మద్యపానం వల్ల ఎసిడిటీ సమస్య పెరుగుతుందని, కాబట్టి వీటికి దూరంగా ఉండడం మంచిదని చెబుతున్నారు.జీర్ణ సమస్యలను పరిష్కరించడానికి అల్లం కూడా సహాయపడుతుంది. కాబట్టి అల్లంను ఆహారంలో చేర్చుకోవాలని సూచిస్తున్నారు.