Site icon HashtagU Telugu

Vastu Tips: ఈ మొక్కలు ఇంట్లో ఉంటే చాలు విజయం మీ వెంటే?

Mixcollage 09 Jul 2024 05 47 Pm 6125

Mixcollage 09 Jul 2024 05 47 Pm 6125

మామూలుగా మనం వాస్తు ప్రకారం ఇంట్లో ఎన్నో రకాల మొక్కలను పెంచుకుంటూ ఉంటాం. అయితే అందులో కొన్ని ఇండోర్ ప్లాంట్స్ అయితే మరికొన్ని అవుట్ డోర్ ప్లాంట్స్. మొక్కలను ఇంట్లో పెంచుకోవడం మంచిదే కానీ, ఏ మొక్కను ఏ దిశలో పెంచుకోవాలి ఏ మొక్కలు ఇంట్లో పెంచుకోకూడదు అన్న విషయాలు కూడా గుర్తుంచుకోవాలి. మరి ఇంట్లో ఎలాంటి మొక్కలను పెంచుకుంటే సంపద శ్రేయస్సు లభిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అలాగే ఏ మొక్క ఏ దిశలో ఉంచాలన్న విషయం గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం..

తులసి, కలువ, అరటి, ఉసిరి, శంఖం పువ్వు తీగ, పుదీనా, పసుపు మొదలైన చిన్న మొక్కలను తోట లేదా ఇంటి బాల్కనీకి ఈశాన్య దిక్కులో, తూర్పు దిశలో పెంచుకోవచ్చట. ఈ దిశలలో చిన్న చిన్న మొక్కలు ఉంటే ఉదయించే సూర్యుని ఆరోగ్యకరమైన కిరణాలు ఇంట్లోకి ప్రవేశిస్తాయని చెబుతున్నారు. అలాగే ఇది ఇది కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. సామాజిక సంబంధాలను బలోపేతం సైతం చేస్తుంది. అలాగే ఉత్తర దిశలో నీలం రంగు పూలను ఇచ్చే మొక్కలు పెంచుకోవాలి. ఇవి జీవితంలో శ్రేయస్సును తీసుకురావడానికి సహాయపడతాయి.

నీలం రంగు వ్యక్తి జీవితంలో స్థిరత్వం, స్వచ్ఛతను తెస్తుంది. నీలిరంగు కుండీలో మనీ ప్లాంట్‌ను నాటడం వల్ల కెరీర్‌లో పురోగతి ఉంటుంది. అంతేకాదు నీలి రంగు పుష్పలైన శంఖ పుష్పం తీగను ఈ దిశలో పెంచుకోవడం శుభప్రదం గా చెప్పవచ్చు. ఇంటికి దక్షిణం లేదా పడమర దిశలో పొడవైన చెట్లను నాటడం ఎల్లప్పుడూ సముచితంగా పరిగణించబడుతుంది. ఇంటి నుంచి దూరంలో లేదా పశ్చిమం వైపు ఏదైనా బయట ప్రదేశంలో రావి చెట్టుకుని పెంచుకోవడం శుభ ఫలితాలనిస్తుంది. ఈ దిశలో చాందినీ, సన్న జాజులు, మల్లె తదితర తెలుపు రంగు పూల మొక్కలను నాటడం వల్ల లాభాలు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. దీంతో పిల్లల్లో సృజనాత్మక శక్తి పెరుగుతుంది. శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన బిల్వ చెట్టును ఇంటికి వాయువ్య దిశలో నాటడం చాలా శుభప్రదంగా భావిస్తారు.